Festival Sale 2023: ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో మీరు మంచి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, రూ.20,000 నుండి రూ.50,000 వరకు అత్యుత్తమ కెమెరాలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. ప్రతి ధర విభాగంలో మూడు నుంచి నాలుగు ఆప్షన్లు చూద్దాం. మీ టేస్ట్‌కు తగ్గట్లు వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఇందులో ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌ల్లో మంచి బ్యాటరీ, డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, వేగవంతమైన ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
రూ.20 వేలలోపు ఇవే...
ఒకవేళ మీ బడ్జెట్ రూ. 20,000 అయితే శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, పోకో ఎక్స్5 ప్రో, మోటో ఎడ్జ్ 40 నియో, రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్లను పండుగ సేల్స్‌లో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఈ సేల్‌లో రూ. 14,499కి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
మోటో ఎడ్జ్ 40 నియోని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో డైమెన్సిటీ 7030 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించారు.
రూ.30 వేలలోపు ఈ స్మార్ట్ ఫోన్లు
రూ. 30 వేలలోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే గూగుల్ పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, రియల్‌మీ జీటీ 2 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ, వివో వీ27లను కన్సిడర్ చేయవచ్చు. నథింగ్ ఫోన్ 1లో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను పొందుతారు. ఫోటోగ్రఫీ పరంగా చూసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
రూ.40 వేలలోపు ఏ ఫోన్లు ఉన్నాయి?
మీ బడ్జెట్ దాదాపు రూ. 40,000 అయితే ఐఫోన్ 13, వివో వీ29 ప్రో, గూగుల్ పిక్సెల్ 7, నథింగ్ ఫోన్ 2, ఐకూ 9టీ, షియోమీ 12 ప్రోలను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13లో రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. మీరు దీన్ని రూ. 39,999కి సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
రూ.50 వేల బడ్జెట్ దాటితే...
ఒకవేళ మీ బడ్జెట్ రూ.50 వేలు దాటితే షావోమీ 13 ప్రో, ఐకూ 11, వివో ఎక్స్90 ప్రో, వన్‌ప్లస్ 11, ఐఫోన్ 13, ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీని రూ. 1,16,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీకు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా లభిస్తుంది. దీంతో పాటు మరో రెండు కెమెరాలు కూడా ఉండనున్నాయి.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial