AI Robot Girlfriend Aria: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం నడుస్తోంది. ఏఐ టూల్స్ తర్వాత ఇప్పుడు ఏఐ రోబోట్ 'గర్ల్‌ఫ్రెండ్' కూడా వచ్చింది. ఇది ముఖ కవళికలను చూపించగలదు. దాని లక్షణాలు మానవుల మాదిరిగానే ఉంటాయి. అయితే దీన్న కొనడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది దీనిని టెక్నాలజీ ఫ్యూచర్ అని పిలుస్తుండగా, మరికొందరు దీనిని చాలా వింతైన విషయం అని అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
సీఈఎస్ 2025లో ఏఐ రోబోట్ 'గర్ల్‌ఫ్రెండ్' లాంచ్
ఈ AI రోబోట్ 'గర్ల్‌ఫ్రెండ్' పేరు అరియా. దీనిని అమెరికన్ కంపెనీ రియల్‌బోటిక్స్ 2025లో సీఈఎస్‌లో ప్రారంభించింది. ఈ కంపెనీ సోషల్ ఇంటెలిజెన్స్, కస్టమైజబుల్, నిజమైన మానవుల వంటి లక్షణాలతో రోబోట్‌లను తయారు చేస్తుంది. ఆరియా మొత్తం శరీరంలో 17 మోటార్లు అమర్చారు. ఈ మోటార్లు ఇది మెడను కదిలించడంలో, ఇతర కదలికలలో సాయపడతాయి. దాని ముఖం, జుట్టు రంగు, హెయిర్‌స్టైల్ మొదలైన వాటిని మార్చవచ్చు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
ఆప్టిమస్‌ను కలవాలంట...
ఈ రోబోట్ ఆర్ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను కలిగి ఉంది. ఈ ట్యాగ్‌ల సహాయంతో అది ఏ ముఖం ధరించి ఉందో ఆటోమేటిక్‌గా అంచనా వేస్తుంది. దీని ఆధారంగా అది తన కదలికలను, వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో టెస్లా ఆప్టిమస్ రోబోట్‌ను కలవాలనుకుంటున్నట్లు ఆరియా చెప్పింది. ఆరియా తెలుపుతున్న దాని ప్రకారం ఆప్టిమస్ చాలా అద్భుతమైనది.
వేరియంట్‌లను బట్టి ధరలు
కంపెనీ ఆరియాకు సంబంధించిన మూడు వెర్షన్‌లను ప్రవేశపెట్టింది. ఒక వేరియంట్‌లో మెడ పైన ఉన్న భాగం మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని కోసం, మీరు దాదాపు 10,000 యూఎస్ డాలర్లు (సుమారు 8.60 లక్షల రూపాయలు) చెల్లించాలి. రెండో ఎంపిక మాడ్యులర్ వెర్షన్. దీని భాగాలను వేరు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ. 1.29 కోట్లుగా ఉంది. మూడో ఆప్షన్ ఫుల్ సైజ్ మోడల్. దీని కోసం మీరు దాదాపు రూ. 1.5 కోట్లు చెల్లించాలి. దాని వీడియోపై కామెంట్ చేస్తూ ఒక యూజర్ ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, ఖరీదైనది కూడా అని రాశారు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?