ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్ రజని కలిసింది. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టుపై జగన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా రజనీకి జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాదు తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సీఎం జగన్‌ని తన తల్లిదండ్రులతో కలిసి రజని కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్య పతక పోరు వరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి , జ్ఞాపిక బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రజని స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌తో పాటు తాజాగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్- 2020లో కూడా రజిని పాల్గొంది. ఇప్పటి వరకు రజని భారత్ తరఫున 110 హాకీ మ్యాచ్‌లు ఆడింది.
Also Read: Naresh Tumda: క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు.. కానీ నేడు కూలీ పనులు చేసుకుంటున్నాడు
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ జట్టు... గ్రేట్ బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టుది ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మహిళల జట్టు తమ పోరాట పటిమతో అభిమానులు మనసులు గెలుచుకున్నారు. గత ఆదివారం టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. సోమవారం దిల్లీ చేరుకున్న భారత జట్టును స్థానిక ఓ హోటల్‌లో కేంద్ర క్రీడా శాఖ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Also Read: VVS Laxman: టీమిండియాలో 16 ఏళ్లు ఆడిన లక్ష్మణ్... ప్రపంచకప్‌లో మాత్రం ఆడలేకపోయాడు