వెస్టిండీస్ ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్‌లో సరదాగా గడిపిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆటగాళ్లు మైదానంలో ఎలాగైతే DRS అప్పీల్ చేయడం, థర్డ్ అంపైర్ దాన్ని రీప్లేలో చూసి డెసిషన్ చెప్పడం ఎలా జరుగుతుందో ఆ సన్నివేశాన్ని ఈ క్రికెటర్లు కళ్లకు కట్టినట్లు చూపించారు.
Also Read: IPL-2021: కింగ్స్ పంజాబ్‌లోకి ఆసీస్ పేసర్ ఎలిస్... మరి, మెరిడీత్ స్థానంలో ఎవరు?
కింగ్‌స్టన్ వేదికగా పాకిస్థాన్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. శనివారం రెండో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఈ క్రమంలో మైదానం వద్ద డ్రస్సింగ్ రూమ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు సరదాగా గడిపారు. ఆ గదిలో క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. పేసర్ చెమర్ హోల్డర్ వేసిన బంతిని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వరికన్ ఎదుర్కొన్నాడు. బంతి వరికన్ కుడి మోకాలిని తాకింది. దీంతో డ్రస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లందరూ బ్యాట్స్‌మెన్ LBWగా ఔటయ్యాడని సంబరాలు మొదలుపెట్టారు. అప్పుడు వరికన్ DRS కోరాడు. అప్పుడు జేసన్ హోల్డర్ టీవీలో బంతిని రీప్లేలో ఎలా చూపిస్తారో అలా చూపేందుకు ప్రయత్నించాడు. చివరికి వరికన్ ఔటని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్థాన్Xవెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులోనూ విజయం సాధించి పాకిస్థాన్ పై టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. 21ఏళ్ల నుంచి పాకిస్థాన్ పై వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో విజయం సాధించలేదు. రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.