టీమ్‌ఇండియాకు సారథ్యం వహించిన సారథుల్లో సౌరవ్‌ గంగూలీయే అత్యుత్తమ కెప్టెనని మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటున్నాడు. దాదా కొత్త ఆటగాళ్లతో జట్టును రూపొందించాడని తెలిపాడు. మహీకి రాగానే మంచి జట్టు దొరికిందని వెల్లడించాడు. బుధవారం అతడు మీడియాతో మాట్లాడాడు.


Also Read: IPL 2021: యూఏఈలో ముంబయి ఇండియన్స్‌ ఎందుకు గెలవగలదంటే..? గౌతీ వివరణ ఇదీ


'వారిద్దరూ (గంగూలీ, ధోనీ) మంచి సారథులే.  ఇద్దరిలో అత్యుత్తమం మాత్రం దాదాయే అంటాను. ఎందుకంటే గంగూలీ సారథిగా ఎంపికైనప్పుడు భారత క్రికెట్‌ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.  అలాంటి విపత్కర పరిస్థితుల్లో దాదా కొత్త కుర్రాళ్లను గుర్తించాడు.  అప్పటికే ఉన్న కొద్ది మంది సీనియర్ల సమ్మేళనంతో అద్భుతమైన జట్టును రూపొందించాడు. విదేశాల్లో గెలవడం ఎలాగో నేర్పించాడు. ముందుగా మేం టెస్టులు డ్రా చేయడం తెలుసుకున్నాం. ఆ తర్వాత గెలవడం నేర్చుకున్నాం' అని సెహ్వాగ్‌ '13 జవాబ్‌ నహీ' కార్యక్రమంలో ఆర్జే రౌనక్‌తో అన్నాడు.


Also Read: Suresh Raina romantic with Priyanka: బిగ్‌బాస్‌కు వెళ్తానంటున్న రైనా.. ప్రియాంకతో కలిసి 'మిస్టర్‌ ఐపీఎల్‌' రొమాంటిక్‌ కబుర్లు


గంగూలీ రూపొందించిన జట్టుతో ధోనీ అద్భుతాలు చేశాడని వీరూ తెలిపాడు. కొత్త ప్రతిభావంతులతో భారత క్రికెట్లో సరికొత్త శకానికి నాంది పలికాడని ప్రశంసించాడు. 'ఎంఎస్‌ ధోనీకి అప్పటికే మంచి జట్టు దొరికింది. అందుకే కొత్త జట్టును రూపొందించాల్సిన సవాళ్లు అతడికి ఎదురవ్వలేదు. ఇద్దరూ గొప్ప కెప్టెన్లే అయినా నేనైతే దాదాయే అత్యుత్తమం అంటాను' అని ఈ డ్యాషింగ్‌ ఓపెనర్‌ చెప్పాడు.


గంగూలీ, ఎంఎస్‌ ధోనీ ఇద్దరూ భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో భారత క్రికెట్‌ పాతాళానికి చేరుకున్న వేళ దాదా తన నాయకత్వ ప్రతిభను చాటిచెప్పాడు. జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చి విదేశాల్లో అద్భుత విజయాలు అందించాడు. 2003లో దాదాపు ప్రపంచకప్‌ గెలిపించినంత పనిచేశాడు. పాక్‌లో వన్డే, టెస్టు సిరీసులు, 2003-04లో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలు సాధించాడు.


ఇక ధోనీ ప్రపంచంలో మరెవ్వరూ సాధించలేని ఘనతలు అందుకున్నాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలు కైవసం చేసుకున్నాడు. ఇక ఆసియాకప్‌లు, ఐపీఎల్‌ ట్రోఫీలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో ఐపీఎల్‌ టైటిల్‌కూ సిద్ధమయ్యాడు.


Also Read: Lasith Malinga Retirement: సింహ‌ళ సింహం.. బంతిని వ‌దిలింది!