చెన్నై సూపర్‌  కింగ్స్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా రొమాంటిక్‌గా మారాడు. తన సతీమణి ప్రియాంకను ఎలా కలిశాడో? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో వివరించాడు. దక్షిణాది బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు తనకు అభ్యంతరమేమీ లేదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే తన సోషల్‌ మీడియాలో పంచుకుంది.


ఐపీఎల్‌ రెండో దశ ఆరంభమవుతుండటంతో  ఆటగాళ్లతో సీఎస్‌కే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. భార్యాభర్తలతో 'సూపర్‌ కపుల్స్‌' పేరుతో యూట్యూబ్‌ సిరీస్‌ మొదలుపెట్టింది. అందులో భాగంగా సురేశ్ రైనా, అతడి సతీమణి ప్రియాంకతో ముఖాముఖి నిర్వహించారు.


హోస్ట్‌ అడిగిన ప్రశ్నలకు రైనా జవాబులు చెప్పాడు. దక్షిణాదిన బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు తనకేమీ అభ్యంతరం లేదని వెల్లడించాడు. 'బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు నాకేమీ ఇబ్బంది లేదు. దక్షిణాదిన ఒకసారి నేనీ షో చూశాను. అయితే వారి భాష నేర్చుకోవాల్సి ఉంటుంది (నవ్వుతూ)' అని అతడు చెప్పాడు.


మొదటి సారి ప్రియాంకను ఎలా చూశాడో రైనా గుర్తు చేసుకున్నాడు. రొమాంటిక్‌ కబుర్లు చెప్పాడు. తన ఇంటికి ప్రియాంక ట్యూషన్‌కు వచ్చేదని చెప్పాడు. 'మా ఇంటికి ట్యూషన్‌కు వచ్చినప్పుడు మొదటి సారి ఆమెను చూశాను. మా అన్నయ్య ఆమెకు బోధించేవారు.  నేను బోర్డింగ్‌ పాఠశాలకు వెళ్లకముందు ప్రియాంక, మా వదిన (అన్నయ్య భార్య) మా ఇంటికొచ్చి కలిసి చదువుకొనేవారు' అని రైనా చెప్పాడు. ప్రస్తుత ఈ వీడియో వైరల్‌గా మారింది.


సురేశ్‌ రైనాను సీఎస్‌కే తురుపు ముక్క అనడంలో సందేహమేమీ లేదు. ధోనీ సారథ్యంతో పాటు అతడి మెరుపుల వల్లే చెన్నై మూడుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆడిన ప్రతి సీజన్లోనూ అతడు కనీసం ౩౦౦ పరుగులు చేశాడు.  చాలాసార్లు 500+ పరుగులతో అదరగొట్టాడు. 'మిస్టర్‌ ఐపీఎల్‌'గా పేరు సంపాదించాడు.






కొన్ని కారణాల వల్ల రైనా గతేడాది ఐపీఎల్‌ ఆడలేదు. దాంతో జట్టు యాజమాని శ్రీనివాసన్‌ మొదట ఘాటుగా విమర్శలు చేశారు. తర్వాత విషయాలు తెలుసుకొని అతడు తన చిన్న కొడుకులాంటి వాడని తెలిపారు. నిజానికి రైనా జట్టుతో పాటు ఐపీఎల్‌ దుబాయ్‌కి వచ్చాడు. కొన్నాళ్లు క్వారంటైన్‌లో ఉన్నాడు. హఠాత్తుగా సీజన్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరిని కొందరు దుండగులు హత్య చేశారు. వారి ఇంటిని దోచుకున్నారు. అంతేకాకుండా కరోనా వల్ల కూడా అతడు భారత్‌కు వచ్చాడు.



Also Read: IPL Auction Date: పది జట్ల ఐపీఎల్‌కు అంకురార్పణ.. అక్టోబర్‌ 17నే ఫ్రాంచైజీల వేలం!


Also Read: IPL 2021: ఎరుపు రంగు నుంచి నీలి రంగు జెర్సీకి మారిన ఆర్‌సీబీ.. ఎందుకో తెలుసా?


Also Read: Hiring sentiment improves: పండగల వేళ ఉద్యోగ నియామకాల హేళ..! పెరగనున్న జీతాలు..!