2022లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో తమ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుందని దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రయిజ్ షంసి అన్నారు. ఇంగ్లండ్‌పై విజయం సాధించినా.. దక్షిణాఫ్రికా సెమీస్‌ను చేరుకోలేకపోయింది. 60 పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్‌కు క్వాలిఫై అవుతారనుకున్న దశలో కేవలం 10 పరుగుల తేడాతో మాత్రమే గెలవడంతో ఆస్ట్రేలియా టోర్నీలో ముందుకు వెళ్లింది.
బయటకు నవ్వుతున్నప్పటికీ లోపల తమకు చాలా బాధగా ఉందని షంసి అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు, మేనేజ్‌మెంట్ పట్ల తను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. ఈ టోర్నీలో తమ బెస్ట్ ఇచ్చామని, రాబోయే టోర్నీల్లో మరింత ప్రయత్నించి, మరింత బాగా ఆడతామని ట్వీట్ చేశాడు.
వరల్డ్‌కప్ నుంచి నాకౌట్ అవ్వడం అనేది అంత సులువుగా జీర్ణించుకోదగ్గ విషయం కాదని దక్షిణాఫ్రికా మాజీ కీపర్ మార్క్ బౌచర్ అన్నాడు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం చాలా బాధాకరమైన విషయం అని పేర్కొన్నాడు.
అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా ఒక్కో మ్యాచ్‌లోనే ఓడిపోయినా.. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో సెమీస్‌కు సులభంగా చేరుకున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 12 గ్రూప్-1 చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలిచింది. విజయం సాధించినా అవసరం అయినంత తేడాతో గెలవలేకపోవడంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు దూరం అయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 10 పరుగులతో విజయం సాధించింది. అయినా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లాయి. దక్షిణాఫ్రికా ఇంటి బాట పట్టింది.
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్
Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!
Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం