టీ20 వరల్డ్‌కప్‌లో నేడు జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్.. నమీబియాపై పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం నమీబియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 111 పరుగులకే పరిమితం అయింది. బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ రాణించిన జిమ్మీ నీషంకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ఈ గెలుపుతో న్యూజిలాండ్ సెమీస్‌కు మరింత చేరువైంది. తర్వాతి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే.. న్యూజిలాండ్ సెమీస్ బర్త్ కన్ఫర్మ్ అయినట్లే. ఒకవేళ ఓడిపోతే మాత్రం మిగతా మ్యాచ్‌ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.


ఆదుకున్న నీషం, ఫిలిప్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నిదానంగా ప్రారంభం అయింది. మొదటి వికెట్‌కు 30 పరుగులు జోడించిన అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (18: 18 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అవుటయ్యాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో మరో ఓపెనర్ డేరిల్ మిచెల్ (19: 15 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటవ్వడంతో న్యూజిలాండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వేలను స్కాట్లాండ్ బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు వేగం మందగించింది.


వీరిద్దరూ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించిన అనంతరం కేన్ విలియమ్సన్ (28: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్ 13వ ఓవర్లోనూ, డెవాన్ కాన్వే (17: 18 బంతుల్లో, ఒక ఫోర్) ఇన్నింగ్స్ 14వ ఓవర్లోనూ అవుటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జిమ్మీ నీషం (35 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (39 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) దూకుడుతో న్యూజిలాండ్ చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 67 పరుగులు సమర్పించింది. ఐదో వికెట్‌కు వీరు కేవలం 36 బంతుల్లోనే 76 పరుగులు జోడించడం విశేషం. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగుల చేయగలిగింది. నమీబియా బౌలర్లలో స్కోల్జ్, వీస్, ఎరాస్మస్ తలో వికెట్ తీశారు.


న్యూజిలాండ్ బౌలర్ల డామినేషన్


164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నమీబియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మొదటి వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం మైకేల్ వాన్ లింగెన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడుతూ ఉండటంతో స్కోరు బోర్డు అస్సలు ముందుకు కదల్లేదు.


నమీబియా ఇన్నింగ్స్‌లో 25 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. చివరిల్లో నాలుగు బంతుల్లో ఆరు కొట్టిన రూబెన్ మినహా ఎవరి స్ట్రైక్ రేట్ 100 దాటలేదు. దీంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే నమీబియా చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ రెండేసి వికెట్లు తీయగా.. మిషెల్ శాంట్నర్, జిమ్మీ నీషం, సోధి తలో వికెట్ తీశారు.


Also Read: PAK vs NAM, Match Highlights: సెమీస్ కు పాక్‌.. వరుసగా నాలుగో విక్టరీ! నమీబియాకు హ్యాట్సాఫ్‌.. కాసేపు వణికించారు!


Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ


Also Read: SA vs BANG, Match Highlights: సెమీస్‌ రేసులో సఫారీలు..! బంగ్లా 84కే చిత్తు.. 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విక్టరీ


Also Read: Ind vs NZ T20 Series: టీమ్‌ఇండియాలో భారీ మార్పులు.. న్యూజిలాండ్‌ టీ20 సిరీసుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి