Sunrisers Hyderabad Vs Gujarat Titans: ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ జరుగుతుందా? లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ దశ చివరికి వచ్చేసింది. మ్యాచ్ ఆడుతున్నది రెండు జట్లే అయినా... ఇందులో గెలుపోటములు పరోక్షంగా మిగతా జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. నేటి మ్యాచ్‌లో మూడు రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? అవేంటి ఎలా ముగిస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం


సిట్యుయేషన్ 1 - మ్యాచ్ జరిగి సన్‌రైజర్స్ గెలిస్తే... ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి సన్‌రైజర్స్ విజయం సాధిస్తే సన్‌రైజర్స్ 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిస్తే మూడో ప్లేస్‌ను ఆక్యుపై చేస్తుంది. క్వాలిఫయర్ 1 రేసులో సన్‌రైజర్స్ మరో అడుగు ముందుకు వేస్తుంది. కాబట్టి మరొక్క స్థానం మిగులుతుంది. అలాంటి పరిస్థితిలో మే 18వ తేదీన చిన్నస్వామిలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వర్చువల్ నాకౌట్‌గా మారుతుంది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ... సీఎస్కేని 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఓడిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. లేదంటే చెన్నై ముందంజ వేస్తుంది.






సిట్యుయేషన్ 2 - మ్యాచ్ జరిగి గుజరాత్ టైటాన్స్ గెలిస్తే... ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి గుజరాత్ టైటాన్స్ గెలిస్తే... సన్‌రైజర్స్ 14 పాయింట్లతో ఉంటుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది కాబట్టి గుజరాత్‌పై ఈ విజయం ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ప్లేఆఫ్స్ రేసులో రెండు బెర్తులూ అలా ఖాళీగా ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు జట్ల ప్లేఆఫ్స్ ఆశలని వారి ఆఖరి మ్యాచ్ నిర్ణయిస్తుంది.


సిట్యుయేషన్ 3 - మ్యాచ్ రద్దయితే... ఈ మ్యాచ్ క్యానిల్ అయితే గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లకూ చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో 15 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ క్వాలిఫయర్ 1 అవకాశం మాత్రం కాస్త క్లిష్టం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో చెన్నైకి మాత్రమే 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. మరే జట్టుకు 14 పాయింట్లను మించి సాధించే స్కోప్ లేదు. కాబట్టి హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ నాలుగో ప్లేఆఫ్స్ బెర్తును డిసైడ్ చేస్తుంది.