యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), హాసిని సుధీర్ జంటగా 'పురుషోత్తముడు' (Purushothamudu Movie) సినిమా రూపొందుతోంది. 'ఆకతాయి', 'హమ్ తుమ్' తర్వాత రామ్ భీమన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు.


''ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడు అయితే మరొక యుగంలో నాన్న మాట వినని ప్రహ్లదుడు మహనీయుడు అయ్యాడు'' అని హీరో రాజ్ తరుణ్ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. పల్లెటూరి నేపథ్యంలోని హీరో పాత్రతో సినిమా తెరకెక్కించారు. పట్నం నుంచి వచ్చిన విలన్ ఎంట్రీతో కథ మొత్తం మారిందని అర్థం అవుతోంది. 'మీ అందరికీ వాడొక మామూలు మనిషి. కానీ, అక్కడ ఒక ఊరు మొత్తానికి దేవుడు' అని హీరో పాత్రకు ప్రకాష్ రాజ్ చేత ఎలివేషన్ ఇప్పించారు. రమ్యకృష్ణ ఓ క్యారెక్టర్ చేశారు. భారీ తారాగణంతో అగ్ర హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా చేశారని అర్థం అవుతోంది.



జూన్ 6న విడుదలకు సన్నాహాలు
Purushothamudu Release Date: రాజ్ తరుణ్ మాట్లాడుతూ... ''మా నిర్మాత రమేష్ గారు కావాల్సినంత ఖర్చు పెట్టి సినిమా బాగా వచ్చేలా చూసుకున్నారు. దర్శకుడు రామ్ భీమనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక్క చూపుతో సన్నివేశం ఎలా ఉండాలో మేం డిస్కస్ చేసుకునేవాళ్లం. ఆయన పెద్ద దర్శకుడయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. జూన్ 6న 'పురుషోత్తముడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాం. సెన్సార్ పూర్తి అయ్యాక విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.


Also Read: 'టాక్సిక్'లో హీరోయిన్ ఆ అమ్మాయే - 'కెజియఫ్' యశ్ సరసన హిందీ హీరో వైఫ్!




తాను 30 ఏళ్ల కింద సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నానని నిర్మాత డా రమేష్ తేజావత్ తెలిపారు. 'పురుషోత్తముడు' గురించి ఆయన మాట్లాడుతూ... ''రామ్ భీమన కథ చెప్పిన వెంటనే ప్రొడ్యూస్ చేద్దామన్నాను. నిర్మాతగా పేరు ఉన్నా నా బ్రదర్ ప్రకాష్, ఇంకా నా వైఫ్, పిల్లలు ప్రొడక్షన్ చూసుకున్నారు. ఈ సినిమా వరకు  'పురుషోత్తముడు' అంటే రామ్ భీమన. యాక్సిడెంట్ జరిగినా షూటింగుకు వచ్చి డైరెక్షన్ చేశారు. అంతా దగ్గరుండి చూసుకున్నారు. 102 డిగ్రీస్ జ్వరంలో మా హీరోయిన్ షూటింగ్ చేసింది'' అని చెప్పారు. టీజర్ మంచి స్పందన అనుకుందని, త్వరలో ట్రైలర్ విడుదల చేసి సినిమాతో థియేటర్లలో కలుద్దామని నిర్మాత ప్రకాష్ తేజావత్ తెలిపారు. రామ్ భీమన కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యానని, మార్నింగ్ టు ఈవెనింగ్ ఆయన సేమ్ ఎనర్జీతో షూటింగ్ చేసేవారని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ భీమన, నటులు ఆకెళ్ల గోపాలకృష్ణ, 'రచ్చ' రవి, గేయ రచయిత, దర్శకడు వీరశంకర్, చిత్ర కథానాయిక హాసిని సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


Also Read: యాంక ర్‌కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీకి!


Purushothamudu Movie Cast And Crew: రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా నటించిన 'పురుషోత్తముడు' సినిమాలో ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముఖేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ఛాయాగ్రహణం: పీజీ విందా, సంగీతం: గోపీ సుందర్, సాహిత్యం: చంద్రబోస్ - రామజోగయ్య శాస్త్రి - చైతన్య ప్రసాద్ - బాలాజీ - పూర్ణ చారి, నిర్మాణ సంస్థలు: శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్, నిర్మాతలు: డా. రమేష్ తేజావత్ - ప్రకాష్ తేజావత్, రచన - దర్శకత్వం: రామ్ భీమన