ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి ఐశ్యర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan)కు గాయం అయ్యింది. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ కొంచెం ఆందోళన చెందారు. అయితే, ఆమెకు గాయం ఎప్పుడు, ఎలా అయ్యింది? ఆలోచించ సాగారు. అయితే, హ్యాపీగా నడుస్తున్న ఆవిడ్ని చూశాక కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఎయిర్ పోర్టులో గాయమైన చేతితో...
Cannes Film Festival 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెడ్ కార్పెట్ మీద నడవడం కోసం ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ముంబై నుంచి బయలు దేరారు. ఆమె వెళ్లే ముందు కెమెరా కంటికి చిక్కారు. అప్పుడు చేతికి కట్టుతో కనిపించారు. అలా ఐశ్వర్యకు గాయమైన సంగతి బయటకు వచ్చింది. గాయమైనా సరే కేన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడం కోసం వెళ్లిన ఆమె కమిట్మెంట్ పట్ల ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదీ సంగతి!
Also Read: 'టాక్సిక్'లో హీరోయిన్ ఆ అమ్మాయే - 'కెజియఫ్' యశ్ సరసన హిందీ హీరో వైఫ్!
అమ్మాయి ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కేన్స్ (Cannes 2024)కు వెళ్లారు. 2022లో ఫస్ట్ టైం ఐశ్వర్యను కేన్స్ చలన చిత్రోత్సవాలకు ఇన్వైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్లుగా ఆమె కేన్స్ తీరానికి వెళ్లి వస్తున్నారు. ఫేమస్ కాస్మొటిక్ బ్రాండ్ (Loreal Company)తో ఇంత లాంగ్ అసోసియేషన్ ఉన్న అందాల భామ ఐశ్వర్య అని చెప్పడంలో మరో మాటకు తావు లేదు. ఈ విషయంలో ఆమె నయా రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు.
ఐశ్వర్యతో పాటు ఈ ఏడాది కేన్స్ చలన చిత్రోత్సవాలకు వెళ్లిన అందాల భామల జాబితాలో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్', 'కబీర్ సింగ్' సినిమాల ఫేమ్ కియారా అద్వానీ కూడా వెళుతోంది. ఆల్రెడీ ఆమె కూడా ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఐశ్వర్య, కియారా ఇద్దరిలో ఎవరు బెస్ట్? అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజనులు పోల్స్ పెడుతున్నారు.
Also Read: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కియారా అద్వానీ - ప్రపంచ సెలబ్రిటీలతో కలిసి డిన్నర్ చేసే అవకాశం