హైప్ ఎక్కించారు... అది కూడా అలా ఇలా కాదు! భీభత్సంగా! అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు కళ్లు కాయలు కాసేలా విపరీతంగా వెయిట్ చేస్తున్నది ఏదైనా ఉందంటే... అది 'దేవర' ఫస్ట్ సింగిల్ కోసమే! ఆ ఎదురు చూపులకు తెర దించుతూ... ఎన్టీఆర్ పుట్టినరోజు (Jr NTR Birthday) సందర్భంగా మే 19న 'ఫియర్ సాంగ్' (Devara Fear Song) రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ నాగ వంశీ సూర్యదేవర, సాంగ్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్స్ ఆ అంచనాలు మరింత పెంచాయి.


నా మాట నమ్మండి... హుకుం మర్చిపోతారు!
''ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ (Tarak) అన్న అభిమానులకు పర్ఫెక్ట్ యాంథమ్. మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను. నన్ను నమ్మండి... హుకుం మర్చిపోతారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ నెక్స్ట్ లెవల్ మాస్! దేవర ముంగిట నువ్వెంత'' అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సూర్యదేవర ట్వీట్ చేశారు.


Also Read: ఎన్టీఆర్ బర్త్ డే - భార్య ప్రణతితో కలిసి వెళ్లింది ఆ దేశానికే!






హుకుం అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాలో సాంగ్. అభిమానులకు, ప్రేక్షకులకు ఆ పాట విపరీతంగా నచ్చింది. హుకుం టైగర్ కా హుకుం అంటూ ఆడియన్స్ కూడా పాడుకున్నారు. చార్ట్ బస్టర్ సాంగ్ కంటే సూపర్ ఉంటుందని, ఆ పాటను మర్చిపోతారనేది పెద్ద స్టేట్మెంట్. దాంతో అంచనాలు మరింత పెరిగాయి.


ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది... భీభత్సం!
'దేవర' సినిమాలో 'ఫియర్' సాంగ్ రాసింది రామ జోగయ్య శాస్త్రి. ప్రియతమ దేవర కోసం ప్రేమగా రాసిన భీభత్సమని, ఈ నెల 19న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్దని ఆయన ట్వీట్ చేశారు. ఇది అభిమానుల్లో మరింత జోష్ నింపింది.


Also Readdయాంకర్‌కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీకి!






తమిళ సినిమాలకు అనిరుద్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్, సాంగ్స్ అయన ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ కావడం వెనుక కీ రోల్ ప్లే చేశాయి. తెలుగులో అతడికి మాస్ కమర్షియల్ సినిమాలు చేసే ఛాన్స్ రాలేదు. 'అజ్ఞాతవాసి' చేసినా రిజల్ట్ బాలేదు. మిగతావి చిన్న సినిమాలు. 'దేవర'తో అనిరుద్ తెలుగులో భీభత్సమైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడట.