Renu Desai Shared Video on Her Account Hacking Rumours: జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ ఏదోక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. విడాకులకు ముందు మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆమె విడాకులు అనంతరం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. తరచూ తన మాజీ భర్తను ఉద్దేశిస్తూ పరోక్ష కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఇక విడాకుల తర్వాత తన పిల్లలు అకార, ఆద్యాలతో ఒంటరిగా జీవిస్తున్న ఆమె తరచూ తన పిల్లల వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటారు.


ఈ క్రమంలో తాజాగా రేణు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్‌ పోస్ట్‌ దర్శనం ఇచ్చింది. క్యూఆర్‌ కోడ్‌ ఫోటో పెడుతూ ఆమె విరాళాలు కావాలని కోరినట్టుగా పోస్ట్‌ ఉంది. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్క్‌ అయ్యారు. రేణ్‌ దేశాయ్‌ ఇలా డబ్బులు అడగడం ఏంటని, అదీ కేవలం మూడు వేలు. ఆమె కనీసం మూడు వేలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారా? అంటూ ఆమె ఫాలోవర్స్‌ డైలామాలో పడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఆమె అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. తాజాగా తన అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడంపై రేణు దేశాయ్‌ స్వయంగా స్పందించారు. ఈ మేరకు ఆమె వీడియో షేర్‌ చేశారు. ఆ డబ్బులు అడిగింది తానే అంటూ క్లారిటీ ఇచ్చారు.






తనకు ఆరోగ్యం బాగా లేదని అందుకే వీడియోస్‌ చేయడం లేదన్నారు. "నా అకౌంట్ హ్యాక్‌ అవ్వలేదు. ఆ డబ్బులు అడిగింది నేనే. నా అకౌంట్ ఎవరు హ్యాక్ చేయలేదు. రెగ్యులర్‌గా నేను డబ్బులు డొనేట్ చేస్తుంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది కదా. డొనేషన్స్‌కి  నా డబ్బులంతా ఇచ్చేస్తే.. నా పిల్లల కోసం కావాలి. అందుకే నా వరకు సాయం చేశాక ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ బ్యాలెన్స్ డబ్బులు నా ఫాలోవర్స్‌ని అడుగుతున్నాను.  యానిమల్స్, చిన్నారుల ఫుడ్‌ కోసం నేను విరాళాలు ఇస్తుంటాను. అదే నా ఫైనల్ టార్గెట్. త్వరలోనే వాటి కోసం ఓ షెల్టర్ నిర్మిస్తాను. అప్పుడు నేను అందరిని అధికారికంగా విరాళాలు సేకరిస్తాను. నా రిక్వెస్ట్‌కి స్పందించి రూ. 3500 పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 


కాగా బద్రి సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్‌. ఈ మూవీ సమయంలోనే ఆమె పవన్‌ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు కొంతకాలం సహాజీవనం తర్వాత పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరికి కొడుకు అకిరా, కూతురు ఆద్యా జన్మించారు. అయితే కొంతకాలం అనోన్యంగా జీవించిన పవన్‌, రేణు దేశాయ్‌లు సడెన్‌గా విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకులు అనంతరం పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తున్న రేణు దేశాయ్‌ మరాఠిలో పలు చిత్రాలు నిర్మిస్తూ నిర్మాతగా మారారు. మరోవైపు తెలుగులో ఓ డ్యాన్స్‌ షోకు జడ్జీగా వ్యవహరించారు. ఆ తర్వాత కాస్తా గ్యాప్‌ తీసుకున్న ఆమె ఇటీవల మాస్‌ మహారాజా టైగర్‌ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని రేణు దేశాయ్‌ స్పష్టం చేశారు.