Jr NTR to celebrate his birthday with family: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. మే 19న... అంటే తారక రాముడి పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు 'దేవర'లో ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మరి, ఎన్టీఆర్ తన బర్త్ డేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా?


ఫ్యామిలీతో టర్కీ వెళ్లిన ఎన్టీఆర్!
Jr NTR off to Turkey for Birthday: ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలు రెండు సెట్స్ మీద ఉన్నాయి. అందులో 'దేవర' ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ 'వార్ 2' మరొకటి. కొన్ని రోజుల నుంచి ముంబైలో హిందీ సినిమా చిత్రీకరణ చేస్తున్న ఎన్టీఆర్, తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ఆయన ముంబై వెళ్లలేదు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వారం రోజులు షూటింగులకు సెలవు ప్రకటించారు. 


హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి (NTR Wife Pranathi) కనిపించారు. ఈ దంపతులు ఇద్దరు దుబాయ్ వెళ్లారు. అక్కడి నుంచి టర్కీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. టర్కీలో ఎన్టీఆర్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు.


Also Read: యాంకర్‌కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీకి!






దేవర సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
Devara First Single Release Date: ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానుల ఎదురు చూపులు అన్నీ 'దేవర' ఫస్ట్ సాంగ్ రిలీజ్ కోసమే! అనిరుద్ రవిచందర్ ఎన్టీఆర్ కోసం ఎటువంటి సాంగ్స్ కంపోజ్ చేశారోనని ఆలోచిస్తున్నారు. మాస్ కమర్షియల్ సినిమాలకు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇవ్వడంలో అనిరుద్ స్పెషలిస్ట్. 'దేవర'తో పాటు 'వార్ 2' నుంచి ఫస్ట్ లుక్ లాంటిది ఏమైనా విడుదల చేస్తారేమో చూడాలి. ఆ లుక్ వస్తే అభిమానులకు పండగే.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు


'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత (Jr NTR next movie after RRR) ఎన్టీఆర్ నుంచి మరొక సినిమా రాలేదు. పాన్ ఇండియా స్థాయిలోనే కాదు, జపాన్ వంటి దేశాల్లోనూ 'ఆర్ఆర్ఆర్' భారీ విజయం సాధించింది. హాలీవుడ్ దర్శక నిర్మాతలు పలువుర్ని ఆకట్టుకుంది. దాంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అభిమానులు అందరూ ఆశించే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేశారు. పాన్ ఇండియా సినిమాలు 'దేవర', 'వార్ 2' యాక్సెప్ట్ చేశారు. 



'దేవర', 'వార్ 2'... ఆ రెండు సినిమాలు చేసిన తర్వాత కన్నడ సినిమా 'ఉగ్రం', పాన్ ఇండియా ఫిలిమ్స్ 'కెజియఫ్', 'సలార్' తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. మరి, బర్త్ డేకు ఆ సినిమా అప్డేట్ ఏమైనా వస్తుందో లేదో? వెయిట్ అండ్ సి.