iQoo Z9x 5G: రూ.12 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ - ఐకూ జెడ్9ఎక్స్ 5జీ వచ్చేసింది!

iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్9ఎక్స్.

Continues below advertisement

iQoo Z9x 5G Launched: ఐకూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు.

Continues below advertisement

ఐకూ జెడ్9ఎక్స్ ధర (iQoo Z9x 5G Price in India)
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.14,499కు, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్‌ను రూ.15,999కు కొనుగోలు చేయవచ్చు. టొర్నాడో గ్రీన్, స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. మే 21వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు లభించనుంది.

Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!

ఐకూ జెడ్9ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (iQoo Z9x 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పిక్సెల్ డెన్సిటీ 393 పీపీఐగా ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఐకూ జెడ్9ఎక్స్ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ఇందులో ఉంది.

ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా అందించారు. ఫోన్ ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌ను కూడా అందించారు.

128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. 

ఐకూ జెడ్9ఎక్స్ 5జీ బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఐకూ జెడ్9ఎక్స్ 5జీ మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది.

Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!

Continues below advertisement