Reykjavik Open 2022: ప్రజ్ఞానంద తగ్గేదే లే! రెక్‌జవిక్‌ ఓపెన్‌ కైవసం.. ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు!

Reykjavik Open 2022 : భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరో అద్భుతం చేశాడు. ప్రతిష్ఠాత్మక రెక్‌జవిక్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీని గెలుచుకున్నాడు.

Continues below advertisement

Reykjavik Open 2022 Chess Results Indian Grandmaster Praggnanandhaa Wins Reykjavik Open Tournament : భారత గ్రాండ్‌ మాస్టర్‌(Indian Grandmaster ) ఆర్‌.ప్రజ్ఞానంద(Praggnanandhaa ) మరో అద్భుతం చేశాడు. ప్రతిష్ఠాత్మక రెక్‌జవిక్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ(Reykjavik Open Chess Tournament)ని గెలుచుకున్నాడు. తొమ్మిది రౌండ్లు ఆడి 7.5 పాయింట్లతో అగ్రగామిగా నిలిచాడు. 16 ఏళ్ల ఈ కుర్రాడు తన సహచరుడైన మరో గ్రాండ్‌మాస్టర్‌ డీ గుకేశ్‌(D. Guneshan)ను ఆఖరి రౌండ్లో ఓడించి విజేతగా ఆవిర్భవించాడు.

Continues below advertisement

ఆఖరి రౌండ్లో గుకేశ్‌ ఓ ఎత్తులో పొరపాటు చేయడంతో ప్రజ్ఞానందకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. సునాయాసంగా విజయం అందుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన తొమ్మిది రౌండ్లలోనూ ప్రజ్ఞానంద అజేయంగా నిలవడం ప్రత్యేకం. ఆఖరి రెండు రౌండ్లలో అతడు గుకేశ్‌, మతియు కార్నెట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. అంతకు ముందూ నాలుగు విజయాలు సాధించాడు. అమెరికన్‌ ఆటగాడు అభిమన్యు మిశ్రాను ఓడించాడు.

ఈ విజయం ద్వారా ప్రజ్ఞానందకు (ఎలో 2624) మరో 13.2 ఎలో రేటింగ్‌ పాయింట్లు వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే ఓ ఆన్‌లైన్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను అతడు ఓడించిన సంగతి తెలిసిందే. ఇక 6 పాయింట్లతో వెనకబడ్డ గుకేశ్‌ 17వ స్థానంలో, గ్రాండ్‌మాస్టర్ అభిజీత్‌ గుప్తా 6.5 పాయింట్లతో ఎనిమిదో స్థానం అందుకున్నాడు. నెదర్లాండ్స్‌ గ్రాండ్‌ మాస్టర్‌ మాక్స్‌ వార్మర్‌డామ్‌ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో, డెన్మార్క్‌ ఆటగాడు మాడ్స్‌ అండర్సన్‌ మూడో స్థానంలో నిలిచారు. అభిమన్యు మిశ్రా 7 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు. ఐఎమ్‌ తానియా సచ్‌దేవ్‌ 6 పాయింట్లతో 21వ స్థానం, 5.5 పాయింట్లు అందుకున్న బీ అదిబన్‌ 34వ స్థానంలో నిలిచారు.

Also Read: నిజానికి ఈ ఒక్క క్యాచే CSKను గెలిపించింది! లేదంటే...?

Also Read: ఈ స్టన్నింగ్ క్యాచ్‌ ఏంటి రాయుడూ! ఇరగదీశావ్‌గా! వీడియో వైరల్‌

Also Read: పంజాబ్‌దే పైచేయి! మరి ముంబయి ఇండియన్స్‌ గెలవగలదా?

Continues below advertisement
Sponsored Links by Taboola