IPL 2022, Mumbia Indians vs Punjab Kings head to head records: ఐపీఎల్‌ 2022లో 23వ మ్యాచులో ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), ఇప్పటి వరకు కప్‌ గెలవని పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తలపడుతున్నాయి. పుణె ఈ మ్యాచుకు వేదిక. లీగు చరిత్రలోనే అత్యంత బలమైన జట్టుగా పేరుపడ్డ ముంబయి ఈ సీజన్లో ఒక్క మ్యాచైనా గెలవలేదు. మరోవైపు చక్కని హిట్లరతో పంజాబ్‌ జోష్‌లో ఉంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిది ఆధిపత్యం? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? గెలిచేదెవరు?


MI ఐదోదైనా గెలుస్తుందా?


ముంబయి ఇండియన్స్‌ (MI) ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. నేటి మ్యాచులో వారు గెలవడం అత్యంత అవసరం. లేదంటే దాదాపుగా వారు ప్లేఆఫ్‌కు దూరమైనట్టే! ఒకప్పుడు భీకరమైన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో బలంగా కనిపించిన రోహిత్‌ సేన (Rohit Sharma) ఈ సారి డీలా పడింది. మిడిల్‌ ఓవర్లలో పరుగులు చేయడం లేదు. పైగా బౌలర్లు విపరీతంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)నూ ప్రత్యర్థులు ఈజీగా టార్గెట్‌ చేస్తున్నారు. అయితే తిలక్‌ వర్మ (Tilak varma), బ్రూవిస్‌ వంటి కుర్రాళ్లు రాణిస్తుండటం భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) సూపర్‌ డూపర్‌ హిట్టర్లతో ఉంది. లియామ్‌ లివింగ్‌స్టన్‌ (Liam Livingstone) మిడిల్‌ ఓవర్లలో పరుగులు చేస్తున్నాడు. అయితే బౌలింగ్‌, ప్రత్యేకించి డెత్‌ బౌలింగ్‌ బాగాలేకపోవడం వారిని వేధిస్తోంది.


PBKSదే కాస్త పైచేయి!


ఇప్పటి వరకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ (MI vs PBKS) 28 సార్లు తలపడ్డాయి. అయితే పంజాబ్‌దే కాస్త పైచేయిగా ఉంది. వారు 15 సార్లు గెలిస్తే ముంబయి 12 సార్లే గెలిచింది. రీసెంట్‌గా ఆడిన ఐదు మ్యాచుల్లో 3-2తో ముంబయిదే ఆధిపత్యం. ఇందులో ఒక డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఉంది. ప్రస్తుతానికైతే పంజాబ్‌కు అవకాశాలు ఉన్నాయి. అలాగని ఇప్పటికే 4 మ్యాచులో ఓడిపోయిన ముంబయి బలంగా పుంజుకున్నా ఆశ్చర్యం లేదు.


MI vs PBKS Probable XI


ముంబయి ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, డీవాల్డ్‌ బ్రూవిస్‌, కీరన్‌ పొలార్డ్‌, ఫాబియన్‌ అలన్‌, మురుగన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, తైమల్‌ మిల్స్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ / బాసిల్‌ థంపి


పంజాబ్‌ కింగ్స్‌: శిఖర్ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, జానీ బెయిర్‌ స్టో, లియామ్‌ లివింగ్‌స్టన్‌, జితేశ్‌ శర్మ, షారుక్‌ ఖాన్‌, ఒడీన్‌ స్మిత్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, వైభవ్‌ అరోరా, అర్షదీప్‌ సింగ్‌