సెప్టెంబరు 19 నుంచి ఈ ఏడాది IPL రెండో విడత సీజన్ ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు ఫ్రాంఛైజీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తాజాగా కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు.






శ్రీలంకకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు RCBలో చేరారు. ఆస్ట్రేలియా ఆటగాడు అడమ్ జంపా స్థానంలో హసరంగాకు చోటు దక్కగా, కివీస్ ఆటగాడు ఫిన్ అలెన్ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ స్థానంలో శ్రీలంక ప్లేయర్ దుష్మంత చమేరాను జట్టులోకి తీసుకున్నారు. 






కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో ఐదింట విజయం సాధించింది. సెప్టెంబరు 20న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.  


Also Read: IPL 2021 In UAE: పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 14 మిగతా సీజన్‌కు ఇద్దరు విదేశీ క్రికెటర్లు దూరం


కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది IPL సీజన్ మధ్యలో అర్థంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో మిగిలిన మ్యాచ్‌లను UAEలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల ఆటగాళ్లు  UAE చేరుకున్నారు. సెప్టెంబరు మొదటి వారంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పయనమవ్వనున్నట్లు సమాచారం.   


Also Read: Radhika: చిరంజీవి, పీవీ సింధుతో రాధిక ఫొటో.. ఆమె ట్వీట్ చూసి నెటిజనులు ట్రోలింగ్, ఆ తప్పేంటో తెలుసా?