టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీపై కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే అత్యంత మెరుగైన కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఒక సారథిగా అతడు సాధించనిది ఏమీ లేదని వెల్లడించాడు. ప్రపంచ క్రికెట్లో ధోనీ 'కింగ్‌ కాంగ్‌' అని వర్ణించాడు.


Also Read: రాహుల్‌ X కోహ్లీ... బెంగళూరును ఓడిస్తే పంజాబ్‌ బతుకుంది!


'తెల్లబంతి క్రికెట్లో ధోనీ అత్యంత గొప్ప కెప్టెన్‌. ఐసీసీ టోర్నీల్లో అతడి రికార్డులు పరిశీలించండి. అతడు గెలవంది ఏమీ లేదు. ఐపీఎల్, ఛాంపియన్స్‌ లీగ్‌, అన్ని ఐసీసీ టోర్నీలు, రెండు ప్రపంచకప్‌లు గెలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి సమీపంలో మరెవ్వరూ లేరు. గొప్పగా చెప్పాలంటే అతడో కింగ్‌ కాంగ్‌' అని శాస్త్రి అన్నాడు.


'ధోనీ సారథ్యం వహిస్తున్న జట్టును చూడండి. ఉదాహరణకు చెన్నై సూపర్‌కింగ్స్‌ను తీసుకోండి. ఆ జట్టెంతో నియంత్రణతో ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ సిక్సర్లు, బౌండరీలు బాదేస్తుంటారు. నియంత్రణ, పరిణతి కనిపిస్తాయి' అని శాస్త్రి వెల్లడించాడు.


Also Read: చెన్నైపై ఆరు వికెట్లతో రాజస్తాన్ విజయం.. పాపం గైక్వాడ్.. సెంచరీ వృథా!


మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ ధోనీని టీమ్‌ఇండియాకు మెంటార్‌గా ఎంపిక చేశారు. తన అనుభవం, ప్రశాంతత, నిర్ణయాలు తీసుకోవడంలో అతడి పరిణతి జట్టుకు ఉపయోగపడుతుందని గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ధోనీకి ఐసీ కప్పులు గెలిచిన అనుభవం ఎంతగానో ఉంది. అతడి ఉనికి జట్టుకు సమతూకం, ప్రశాంతత తీసుకొస్తుందని అంతా భావిస్తున్నారు.


Also Read: పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లు ఇవే.. రేసు మరింత రసవత్తరం!


ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరుకుంది. తొమ్మిది మ్యాచులు గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఓపెనర్ రుతురాజ్‌ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా ఫినిషర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ధోనీ తన వ్యూహాలతో ఇతర జట్లను ఓడిస్తున్నాడు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ, బౌలర్లను మారుస్తూ విజయాల్లో కీలకంగా ఉంటున్నాడు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి