మారుమూల ప్రాంతాల్లో లింగ భేదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుడితే వద్దని, మగ పిల్లాడే కావాలని వేధించే అత్తామామలు, భర్తలకు కొదవ లేదు. పుట్టే శిశువు ఆడా, మగా అనే విషయంతో మహిళకు సంబంధం లేకపోయినా ఆమెనే బాధ్యురాలిగా చేస్తూ ప్రవర్తించే కుటుంబ సభ్యులు ఎంతో మంది ఉన్నారు. తాజాగా అలాంటి వేధింపులే చోటు చేసుకోగా.. ఒత్తిడిని తట్టుకోలేని ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ‘‘గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో.. మగ పిల్లాడు పుడితేనే ఇంటికి రా.. అని భర్త, అత్త తేల్చి చెప్పేయడంతో ఆమె మనోవేదనకు గురైంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేని నాలుగు నెలల గర్భిణీ శనివారం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని కామాటిపుర పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోయిన్‌పురా ప్రాంతానికి చెందిన మీనాజ్ బేగం కుమార్తె రుబీనా బేగం (23). ముర్గీచౌక్ ప్రాంతానికి చెందిన అమీర్‌కు ఇచ్చి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అదీ కాక.. భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలని కూడా తరచూ వేధించేవారు.
Also Read: సముద్రం మధ్యన షిప్‌లో సోదాలు ఎలా? అధికారులు అమలు చేసిన పక్కా ప్లాన్ ఏంటంటే..
మళ్లీ రుబీనా బేగం గర్భం దాల్చడంతో నాలుగు నెలలు నిండగానే ఆమెను పుట్టింటికి పంపించారు. వెళ్లేటప్పుడు మళ్లీ ఆడ పిల్ల పుడితే తిరిగి ఇంటికి రావొద్దంటూ వేధించారు. భర్త, అత్త తేల్చి చెప్పేసి.. ఆడపిల్ల పుడితే తన సామగ్రిని కూడా పుట్టింటింకే పంపేస్తామని చెప్పేశారు. గర్భంలో ఆడ పిల్ల ఉందని తెలిస్తే ఆబార్షన్ చేయించుకోవాలని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుబీనా బేగం శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: ఈ సారి "శాక్రిఫైజ్" అయినట్లే !? పోలీసులపైనే వీడియోలు పెట్టి దొరికిపోయిన సునిశిత్ !
పైకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మీనాజ్ బేగం తలుపులు పగలగొట్టి చూడగా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తల్లి మీనాజ్ బేగం ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Also Read : ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. సమంత ఎక్కడ..? అంటూ నెటిజన్ల ప్రశ్నలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి