దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 199 రోజుల తర్వాత ఈరోజు యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కొత్తగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,842 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,38,13,903కి చేరింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య (24,354) కాస్త తగ్గింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.


నిన్న ఒక్కరోజే 244 మంది కోవిడ్ కారణంగా కన్నుమూశారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 4,48,817కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,70,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 199 రోజులుగా నమోదైన యాక్టివ్ కేసులతో పోలిస్తే ఇదే అత్యల్పం కావడం విశేషం. గత 24 గంటల్లో 25,930 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,30,94,529కి చేరింది. గత 24 గంటల్లో 12,65,734 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 57,32,60,724 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. 


Also Read: మీకు కరోనా సోకి తగ్గిందా? జాగ్రత్త.. ఈ కొత్త సమస్య రావొచ్చు, నిమ్స్‌లో ఆరుగురి చేరిక..


90 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరో కొత్త రికార్డు అందుకుంది. దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి టీకాలు అందించిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటివరకు 90,51,75,348 మందికి టీకాలు అందించినట్లు పేర్కొన్నారు. 






Also Read: ఇకపై సొంత ఊరి నుంచే పని.. 'వర్క్ ఫ్రమ్ హౌమ్ టౌన్'.. దేశంలోనే ఏపీలో తొలిసారి


Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి