ఐపీఎల్‌లో ప్రస్తుతం టాప్-4లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఉన్నాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. ఆర్సీబీ, కోల్‌కతాలు మరిన్ని విజయాలు సాధించాల్సి ఉంది.
అయితే బెంగళూరు ఖాతాలో ఇప్పటికే ఏడు విజయాలు ఉన్నాయి. ఇంకా ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. బెంగళూరు ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోతుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నుంచి ఏడో స్థానంలో ముంబై వరకు మొత్తం నాలుగు జట్లు ఐదు విజయాలతో, 10 పాయింట్లతో ఉన్నాయి.
Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్! బుడగ వీడిన క్రిస్‌గేల్.. ఎందుకంటే?
కాబట్టి నాలుగో స్థానం కోసం మొత్తం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ అన్ని జట్లకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో రెండు మ్యాచ్‌లూ గెలిచిన జట్లకే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్లే కొద్దీ ఐపీఎల్ మరింత రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.
జట్టు పరంగా చూస్తే ముంబై చాలా బలంగా ఉంది. కానీ కీలక ఆటగాళ్లు ఫాంలో లేక ఇబ్బంది పడుతున్నారు. టేబుల్ టాపర్ చెన్నైపై విజయంతో రాజస్తాన్ మంచి ఊపు మీదుంది. ఇక పంజాబ్ బౌలింగ్ విభాగాన్ని నమ్ముకుంది. కోల్‌కతా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో నాలుగు జట్లకూ సమాన అవకాశాలు ఉన్నాయి.
ఇక్కడ నుంచి రోజులు గడిచే కొద్దీ కొన్ని జట్ల అవకాశాలు సన్నగిల్లుతాయి. కొన్ని జట్ల అవకాశాలు మెరుగవుతాయి. లీగ్ దశ ముగియడానికి కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ప్రస్తుతానికే రసవత్తరంగా ఉన్న ప్లే ఆఫ్ రేసు రానున్న రోజుల్లో మరింత థ్రిల్లింగ్‌గా మారనుంది.
Also Read: యాష్ తప్పేం చేయలేదు! సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్!
Also Read: విరాట్ సరసన స్మృతి మంధాన.. పింక్ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్ వెళ్లిన పూనమ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి