PV Sindhu Networth News: తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు.. హయ్యెస్ట్ పెయిడ్ లేడీ అథ్లెట్‌గా నిలిచింది. ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా టోర్నమెంట్లు గెలిచి ప్రైజ్ మనీలు సొంతం చేసుకోవడంతో పాటు వివిధ బ్రాండ్ల ఎండార్సమెంట్ల ద్వారా భారీగా సంపాదిస్తోందని సమాచారం. అలాగే వివిధ రకాల ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టి, మంచి రాబడులు సాధిస్తోందని తెలుస్తోంది. సింధు సంపాదన (PV Sindhu Assets)ను మెయిన్‌గా వర్గీకరిస్తే..
ప్రైజ్ మనీ ద్వారా..
29 ఏళ్ల పీవీ సింధు గత పదేళ్ల కాలం నుంచి బ్యాడ్మింటన్ సర్కిళ్లలో తన పేరు ఎక్కువగా వినపడుతోంది. రియో ఒలింపిక్స్‌కు ముందు చాలా మేజర్ బీడబ్ల్యూఎఫ్ టోర్నీలు సాధించిన ఈ ప్లేయర్.. ఈ ఒలింపిక్స్‌లో అద్భుతమే సాధించింది. బ్యాడ్మింటన్ కేటగిరీలో మొట్టమొదటి వ్యక్తిగత రజత పతకాన్ని సాధించింది. దీంతో సింధు దేశమంతా మార్మోగి పోయింది.
అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. అలాగే ఒకసారి ప్రపంచ చాంపియన్షిప్‌లో స్వర్ణం, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించి సంచలనం రేకెత్తించింది. దీంతో ఆమెపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కనక వర్షం కురిసింది. రూ.13 కోట్ల వరకు నజరానాల రూపంలో లభించినట్లు తెలుస్తోంది. అలాగే టోర్నీల ప్రైజ్ మనీని బాగానే వెనకేసినట్లు సమాచారం.
టాప్ బ్రాండ్ల ఎండర్స్మెంట్లతో..
అద్భుత విజయాలతో దేశ ప్రజల మనసు దోచుకున్న సింధును స్పాన్సర్ చేసేందుకు పలు బ్రాండ్లు ముందుకొచ్చాయి. అలాగే ప్రకటనల విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఏషియన్ పెయింట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మేబిలిన్ తదితర బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేసింది. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ పరికరాల కంపెనీ లినింగ్ 2019లో నాలుగేళ్ల ఒప్పందాన్ని రూ.50 కోట్లకు చేసుకుంది. దీంతో పాటు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలోనూ ప్రకటనలు ఇస్తూ భారీగా ఆదాయం సంపాదిస్తోంది.
గతంలో తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఒక ఎండార్స్మెంట్ ఫీజు రూ.1.2 కోట్ల నుంచి రూ.2.25 కోట్ల వరకు ఉందని సమాచారం. అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులతోనూ సింధు సంపాదిస్తోంది.
వెల్ నెస్ బ్రాండ్ హూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు ఆ కంపెనీలో సింధు పెట్టుబడులు పెట్టింది. అలాగే అగ్రిటెక్ స్టార్టప్ కంపెనీ గ్రీన్ డేలు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అలాగే అజాద్ ఇంజినీరింగ్ తదితర ఏరోస్పెస్ పరికరాల తయారీ కంపెనీలో తనకు వాటాలున్నాయని తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని ఖరీదైన ఏరియా ఫిలింనగర్‌లో మూడంతస్తుల భవనంతో పాటు బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 320డీ, మహింద్రా థార్ తదితర కార్లు ఉన్నాయి. ఇక ఇటీవలే తను వివాహం చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త వెంటకసాయి దత్తను గత నెలలో పెళ్లి చేసుకుంది. ఏదేమైనా అటు ఆటతో, ఇటు సంపాదనతో పీవీ సింధు దూసుకుపోతోంది.
Also Read: Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్..