FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ 2022లో చాలా పెద్ద మార్పులు జరిగాయి. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్‌లో కూడా పెద్ద జట్లు ఇంటి బాట పట్టాయి. ఆఫ్రికన్ జట్టు మొరాకో లెజండరీ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్‌ను 1-0 తేడాతో ఓడించింది. ఈ ఓటమితో రొనాల్డో ప్రపంచకప్ కల కూడా చెదిరిపోయింది. రొనాల్డో 7వ నంబర్ జెర్సీతో ఆడతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓటమి తర్వాత రొనాల్డో చాలా నిరాశగా కనిపించాడు. అతని కన్నీటి పర్యంటమైన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
ఇప్పుడు జెర్సీ నంబర్ 7, 2019 సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రొనాల్డో కారణంగా జెర్సీ నంబర్ 7 వైరల్ అవుతోంది. అయితే 2019 సంవత్సరం ఎందుకు వైరల్ అవుతోంది? వాస్తవానికి, 2019 వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని రనౌట్ చాలా కీలకం అయింది. ధోనీ క్రీజులో ఉన్నంత సేపు భారత జట్టు విజయానికి గట్టి పోటీనిచ్చింది. అయితే అతను ఔట్ కావడంతో అంతా మారిపోయింది. భారత జట్టు ఆ మ్యాచ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ధోని జెర్సీ నంబర్ కూడా
క్రిస్టియానో రొనాల్డో మాదిరిగానే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నంబర్ కూడా 7. జెర్సీ నంబర్ ఏడు అనే పోలికతో వీరిద్దరూ తమ చివరి ప్రపంచకప్‌లో జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయారు. సెమీఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. అదే సమయంలో క్వార్టర్స్‌లో పోర్చుగల్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీనిపై అభిమానులు కూడా స్పందించారు.
క్రికెట్, ఫుట్‌బాల్ ప్రేమికులు జెర్సీ నంబర్ 7ని గుర్తుపెట్టుకుని ఉద్వేగానికి లోనవుతున్నారు. జెర్సీ నంబర్ 7 ఉండటం అంత సులువు కాదని చాలా మంది వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్షన్స్ ఇచ్చారు.