Elon Musk on Twitter:


కీలక సమాచారం లీక్..


ట్విటర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య కీలకమైన సమాచారం లీక్ అవుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే ఉద్యోగులకు హెచ్చరికలు చేశారు మస్క్. అయినా...ఆ లీక్‌లు ఆగలేదు. అందుకే...ఈసారి మరింత స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇన్‌ఫర్మేషన్‌ ఎవరూ లీక్ చేయొద్దని తేల్చి చెప్పారు. కాదని ఎవరైనా...లీక్ చేస్తే లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి..దీనిపై కచ్చితంగా ఉండాలని, హామీ పత్రంపై సంతకం కూడా చేయాలని డిమాండ్ చేశారు. Platformers రిపోర్ట్ ప్రకారం ఎలన్ మస్క్ ఉద్యోగులకు ఓ నోట్‌ రాశారు. "ట్విటర్‌లోని అంతర్గతమైన కీలకమైన సమాచారాన్ని కొందరు లీక్ చేస్తున్నారని ఆధారాలతో సహా తెలిసింది. కొందరు కంపెనీ రూల్స్‌ని అతిక్రమించి మరీ ఇలా రహస్య సమాచారాన్ని వేరే వాళ్లకు చేరవేస్తున్నారు. చివరిసారిగా చెబుతున్నాను. కంపెనీ రూల్స్‌ని తలొగ్గి మీరు సంతకాలు చేశారు. ఇప్పుడా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు" అని ఘాటుగా హెచ్చరించారు. సందర్భాన్ని బట్టి కొంత సమాచారం ఇస్తే పర్లేదని..కానీ ఉద్దేశ పూర్వకంగా మీడియాకు అంతర్గత వివరాలను బయటపెడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇక ట్విటర్‌లో లేఆఫ్‌లు కూడా పెరిగిపోతున్నాయి. గంటల కొద్ది పని చేయించడమే కాకుండా...ఆఫీస్‌ను బెడ్‌రూమ్‌గా మార్చేసి అక్కడే పని చేసి పడుకోవాలనే రూల్‌ పెడుతున్నారన్న అసంతృప్తితో చాలా మంది ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు. "ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్...ఉద్యోగులందరిపైనా రూల్స్‌ రుద్దుతారు. వాళ్ల హక్కుల్ని పట్టించుకోరు. చట్టాన్ని ఫాలో అవరు. ఆయన తీరులో మార్పు వస్తే మంచిది" అని ఓ లాయర్ అభిప్రాయపడ్డారు. 
 
వైట్‌ హౌజ్ కామెంట్స్..


 ట్విట్టర్‌ను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk)టేకోవర్ చేసిన తర్వాత రోజుకో మార్పులు జరుగుతున్నాయి. లేఆఫ్‌లు, బ్లూ టిక్, వాక్ స్వాతంత్రం అంటూ మస్క్ రోజుకో ట్వీట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం (వైట్ హౌస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ కార్యకలపాలపై తమ నిఘా ఎప్పుడు ఉంటుందని తెలిపింది. 


"ట్విట్టర్ కార్యకలాపాలపై మేము కచ్చితంగా నిఘా ఉంచుతాం. సోషల్ మీడియా విషయంలో మేము ఎప్పుడు స్పష్టంగానే వున్నాం. దుష్ప్రచారం, హింసను ప్రేరేపించే అంశాల విషయంలో బాధ్యత ఆ  సంస్థలదే. మనం చూస్తున్నాం వాళ్లు చర్యలు తీసుకుంటున్నారు. ట్విట్టర్లో ఎం జరుగుతుందో, మీరంతా ఏం చెబుతున్నారో మేమూ చూస్తూనే ఉన్నాం. వినియోగదారుడి వల్ల హింస, ముఖ్యంగా రాజ్యాంగ సంస్థలపై దాడి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. మేము ట్విట్టర్‌పై పర్యవేక్షణ ను కొనసాగిస్తాం.                                               "
-   శ్వేతసౌధం అధికార ప్రతినిధి


మస్క్ చేపట్టకముందు ట్విట్టర్‌లో ఫ్రీ స్పీచ్‌పై కాస్త కఠినంగా ఆంక్షలు ఉన్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ ఖాతానే సస్పెండ్ చేసింది ఆ సంస్థ.


Also Read: Priyanka Gandhi: కాంగ్రెస్‌కు కొత్త ట్రబుల్ షూటర్‌గా ప్రియాంక గాంధీ, అంతా ఆమె చెప్పినట్టుగానే!