టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 16న తన నివాసంలో ప్రత్యేకంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహిళల హాకీ జట్టును కూడా మోడీ కలిశారు. ప్రతి ఒక్క అథ్లెట్‌తో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. వారి శిక్షణ, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
క్రీడాకారులతో మాట్లాడిన వీడియోను మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ‘మన ఒలింపిక్స్ హీరోలతో మర్చిపోలేని రోజు’ అంటూ ఆ వీడియోకి వ్యాఖ్య జత చేశారు. పతకం గెలిచి వచ్చాక సింధుకు ఐస్‌క్రీం తినిపిస్తానని పీఎం మోదీ ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే మోదీ... సింధుకు ఐస్ క్రీం తినిపించారు. అలాగే
స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మాట్లాడారు. అతడికి చుర్మా తినిపించారు. పురుషుల, మహిళల హాకీ జట్ల సభ్యులతో పాటు రజత పతక విజేత మీరాబాయి చాను, బాక్సర్ లవ్లీనా, మేరీకోమ్‌తో ఆత్మీయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ ఆటగాళ్ల కష్ట సుఖాలు, అనుభవాలు, ఫిట్ నెస్, క్రీడల అభివృద్ధికి ఏం చేయాలో సూచనలను మోదీ తెలుసుకున్నారు. మోదీ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
AlsoRead: Lionel Messi: వేలానికి మెస్సీ వాడిన టిష్యూ... ప్రారంభ ధర ఎంతో తెలుసా?
AlsoRead: Virat Kohli: భారత పరుగుల యంత్రం కోహ్లీ @ 13 ఇయర్స్... కోహ్లీ గురించి 13 ఆసక్తికర విషయాలు