క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు ఇలా ఆటగాళ్లు ఎవరైనా వారు వాడిన బ్యాట్లు, గ్లౌజ్స్, హెల్మెట్స్, జెర్సీలు ఇలా వేటికైనా వేలం నిర్వహిస్తే కోట్ల డబ్బు వచ్చి పడుతుంది. తాజాగా అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ వాడిన ఓ టిష్యూ సుమారు ఏడున్నర కోట్లు పలికి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
కొద్ది రోజుల క్రితం మెస్సీ బార్సిలోనా క్లబ్ ని వీడి PSGకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బార్సిలోనా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మెస్సీ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సమయంలో వాడిన కన్నీరు తుడుచుకునేందుకు వాడిన టిష్యూకి తాజాగా వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఆ టిష్యూకి ప్రారంభ ధరను సదరు వ్యక్తి ఏకంగా ఏడున్నర కోట్ల రూపాయలు పెట్టాడు.
కాంట్రాక్ట్ పొడిగింపులో వచ్చిన సమస్యల వల్ల మెస్సీ స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న బార్సిలోనా క్లబ్ నిర్వాహకులు మెస్సీకి వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా మెస్సీ ఒక టిష్యూ పేపర్‌తో కన్నీళ్లను తుడుచుకున్నాడు. అప్పడు నిర్వాహకులు టిష్యూని దాచి తాజాగా దానికి వేలం నిర్వహించారు. మెస్సీ వాడిన టిష్యూ అంటే అభిమానులకు క్రేజే కదా. దీన్ని ఆసరాగా తీసుకుని ఇంటర్నేషనల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఎమ్‌ఈకెడోలో ఒకరు వేలానికి పెట్టాడు. అయితే ఫుట్‌బాల్ దిగ్గజం కన్నీళ్లు తుడిచిన ఆ టిష్యూ పేపర్‌కు సదరు వ్యక్తి ఫిక్స్ చేసిన ధర అక్షరాల రూ. ఏడున్నర కోట్లు ( 1 మిలియన్ డాలర్లు). ఇంకేముంది ఇది తెలుసుకున్న అభిమానులు ''వార్ని.. మెస్సీ వాడి పడేసిన టిష్యూ పేపర్‌కు ఇంత ధర'' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.