చాలా మంది సాధరణమైన వ్యక్తులు సోషల్ మీడియా పుణ్యామా అని గంటల్లోనే ఫేమస్ అయిపోతున్నారు. అప్పటి వరకు ప్రధాన మీడియా గుర్తించని టాలెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకంటున్నారు. అలాంటి వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
బెంగళూరులో రోడ్లపై తిరిగే బామ్మ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. షేర్‌లు, లైకులు కొడుతున్నారు. సిసిలియా మార్గరెట్ లారెన్స్ రోడ్లపై తిరుగుతూ దొరికింది తింటూ బతుకు నెట్టుకొస్తున్న మహిళ.
ఓ నెటిజన్ ఆమెను కదలించి వివరాలపై ఆరా తీస్తే... తడుము కోకుండా ఇంగ్లిష్‌లో చెప్పిన సమాధానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంగ్లీషులో పరిచయం చేసుకోవడం.. పాటలు పడటం మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
గతంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బేబి ఇలానే సింగర్‌గా మారింది. సరదాగా సోషల్ మీడియా పాడిన ఓ పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్క వీడియోతో ఆమెకు రఘు కుంచె పిలిచి సినిమా ఆఫర్స్ ఇచ్చారు. పలు సినిమాల్లో పాటలు కూడా పాడించారు.
ఇటీవల కాలంలో కేటీఆర్ ఓ బాలిక పాట ఫిదా అయిపోయారు. ఆమె వివరాలు దేవిశ్రీ ప్రసాద్, తమన్‌కు పంపించారు. ఇలాంటి లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని రిక్వస్ట్ చేశారు. దానికి వాళ్లు కూడా స్పందించి తప్పకుండా అవకాశాలు ఇస్తామని సమాధానం ఇచ్చారు.