ఇప్పుడు ఈ వివాదంపై లీగల్ చర్యలు తీసుకునేందుకు ఇమానే ఖలీఫ్ సిద్ధమైంది. ఆన్‌లైన్‌లో తనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసేందుకు ఇమానే ఖలీఫ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మస్క్, రౌలింగ్‌పై దావా..
ఒలింపిక్స్‌లో తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేయాలని అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో ఇమానెపై నెట్టింట చాలా కామెంట్లు వినిపించాయి. ఇటలీ ప్రధాని సహా చాలామంది ఇమానె ఖలీఫ్‌ను మహిళల విభాగంలో ఆడనివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పురుషుల జన్యు లక్షణాలు ఉన్న అథ్లెట్లను మహిళల పోటీల్లోకి ఎలా తీసుకున్నారంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా మండిపడ్డారు. మహిళా అథ్లెట్లు అందరూ ఒకే రకమైన నిబంధనలతో పోటీ పడే హక్కును కాపాడాలని మెలోని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ పోటీలో ఖలీఫ్ పాల్గొనడంపై ఎలాన్ మస్క్(Elon Musk), ప్రముఖ రచయిత జేకే రౌలింగ్(JK Rowling) వంటి ప్రముఖులు విమర్శలు సంధించారు. పురుష క్రోమోజోమ్‌లు ఉన్న అథ్లెట్లు మహిళల క్రీడలలో ఎలా పోటీ పడతారని, అది సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ లు పెడుతున్నారు.
Also Read: వినేశ్ ఫొగాట్ సిల్వర్ మెడల్ పై CAS తీర్పు వాయిదా, అప్పటివరకూ ఎదురుచూపులే
చర్యలకు సిద్ధమైనా ఇమానే..?
సోషల్ మీడియా వేదికగా తనపై జరిగిన వేధింపులపై ఇప్పటికే ఇమానే ఖెలిఫ్ కేసు నమోదు చేసింది. హ్యారీపోటర్ పుస్తక రచయిత జేకే రౌలింగ్ ఇమానే వ్యవహారంగా కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. మహిళల బాక్సింగ్‌లో పురుష క్రోమోజోమ్‌లు ఉన్న వారిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. టెస్లా సీఈవో కూడా ఓ పోస్ట్‌కు రిప్లై ఇవ్వడంతో అతనిపైనా చర్యలు తీసుకోవాలని ఇమానే భావిస్తోంది. మహిళల క్రీడల్లోకి పురుషులను అనుమతించకూడదని ఓ నెటిజన్ ఆ సమయంలో పోస్ట్ చేయగా దానికి కచ్చితంగా అని ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు. దీనిపైనా చర్యలు తీసుకునేందుకు ఇమానే సిద్దమైనట్లు తెలుస్తోంది.
Also Read: అబ్బే ! అదేం లేదు! మా మనూ ఇంకా చిన్నపిల్ల!