పారాలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం దక్కింది. పురుషుల హైజంప్ T47 ఫైనల్ లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించాడు. 2.15 మీటర్లు జంప్ చేసి రికార్డ్ సృష్టించాడు. రోడ్రిక్ టౌన్ సెండ్ ఈ విభాగంలో బంగారు పతకం సాధించాడు.
ఈ సందర్భంగా నిషాద్ కుమార్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ లో మరో పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈరోజు ఉదయం భారత్.. పారాలింపిక్స్ లో తొలి పతకం సాధించింది. టేబుల్ టెన్నిస్ స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్ వన్, చైనా క్రీడాకారిణి యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి పాలైంది. దీంతో ఆమె రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.