India at Olympics on Day 5 Schedule: పారిస్‌ ఒలింపిక్స్‌(Paris olympics)లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. మను బాకర్‌ వరుసగా రెండు పతకాలు అందించింది. ఇక మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు ముందుకు సాగుతున్నారు. ఇవాళ భారత స్టార్ అథ్లెట్లు తమ తదుపరి రౌండ్‌ మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు. బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు(PV Sindhu) ఇవాళ గ్రూప్‌ స్టేజ్ మ్యాచ్‌ను ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన సింధు ఈ మ్యాచ్‌లోనూ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఇప్పటికే రెండు ఒలింపిక్స్‌ పతకాలు గెలిచిన సింధు.. మూడో పతకంపైనా కన్నేసింది. ఇక బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌(Lovlina) కూడా రౌండ్‌ ఆఫ్‌ 16లో అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో వరుసగా రెండు విజయాలు సాధించిన లక్ష్యసేన్‌ నేడు బరిలో దిగనున్నాడు. ప్రణోయ్‌ మ్యాచ్‌ కూడా నేడే జరగనుంది. షూటింగ్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్. స్వప్నిల్ కుసాలే పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్స్ ఫైనల్‌ బెర్తు కోసం తలపడనున్నారు. టేబుల్‌ టెన్నిస్‌లో తెలుగు తేడం ఆకుల శ్రీజ మ్యాచ్‌ కూడా నేడే జరగనుంది.


లవ్లీనాకు కఠినమైన డ్రా వచ్చింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో లవ్లీనా నార్వేకు చెందిన సున్నీఫ అఫ్తాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టాప్ సీడ్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత లి కియాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో లవ్లీనా పంచ్‌ అదిరి గెలిస్తే టోక్యో విశ్వ క్రీడల్లో రజత పతక విజేత అయిన ఫిలిప్పీన్స్‌కు చెందిన నెస్తీ పెటెసియోతో లవ్లీనా తలపడనుంది. 

 

ఇవాళ్టీ భారత షెడ్యూల్‌ ఇలా...

 

షూటింగ్‌

పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ క్వాలిఫికేషన్స్‌

ఐశ్వరీ ప్రతా్‌పసింగ్‌ తోమర్‌, స్వప్నిల్‌ కుశాలె (మ. 12.30)

 

మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌ 2

శ్రేయాసి సింగ్‌, రాజేశ్వరీ కుమారి (మ. 12.30) 

 

 

బ్యాడ్మింటన్‌

మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌: పీవీ సింధు (మ. 12.50)

పురుషుల సింగిల్స్‌ : లక్ష్యసేన్‌ (మ. 1.40), 

ప్రణయ్‌  (రాత్రి 11.00)

 

టేబుల్‌ టెన్నిస్‌

మహిళల సింగిల్స్‌ రౌండ్‌ 32: ఆకుల శ్రీజ (మ. 2.20)

 

బాక్సింగ్‌

మహిళల 75 కిలోల ప్రీ క్వార్టర్స్‌: లవ్లీనా (మ. 3.50)

పురుషుల 71 కిలోల ప్రీక్వార్టర్స్‌: నిషాంత్‌ గీ జోస్‌ (రా. 12.18)

 

ఆర్చరీ

మహిళల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్‌ రౌండ్‌: దీపికా కుమారి (మ. 3.56)

పురుషుల వ్యక్తిగత విభాగం ఎలిమినేషన్‌ రౌండ్‌ - తరుణ్‌దీప్‌ (రా. 9.15)

 

.

ఈక్వెస్ట్రియన్‌

డ్రెస్సేజ్‌ వ్యక్తిగత గ్రాండ్‌ ప్రీ: అనూష్‌ అగర్వాల (మ. 1.30).