IOC advises media against calling trans athletes "biologically male/female": అంతర్జాతీయ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌ గేమ్స్‌ మరో 45 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రీడల్లో సత్తా చాటి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించాలని అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. జులై 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్స్‌ 2024(Paris Olympics 2024 ) పోటీలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. కళ్లు మిరుమిట్లుగొలిపేలా ఆరంభ వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వ క్రీడలు సమీపిస్తున్న వేళ... ఒలింపిక్స్‌ నిర్వహణ కమిటీ(International Olympic Committee) కీలక సూచనలు చేసింది. జెండర్‌ ఈక్వలిటీని పాటించాలని నిబంధనల్లో పేర్కొంది. మహిళలు, ట్రాన్స్‌ జెండర్లను తక్కువ చేసేల ఎలాంటి ప్రకటనలు... కామెంట్లు ఉండకుండా జాగ్రత్త పడాలని ప్రసారకర్తలకు కూడా సూచించింది.


అవమానించొద్దు..

అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ 2015లో కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ రూల్స్‌ ప్రకారం ట్రాన్స్‌జెండ‌ర్ అథ్లెట్లు మ‌హిళ‌ల కేట‌గిరీలో పోటీ చేసేందుకు అర్హులు. అయితే ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే ట్రాన్స్‌జెండ‌ర్ అథ్లెట్లు.. తాను మహిళే అని అంగీకార పత్రం అందించాల్సి ఉంటుంది. ఈ రూల్స్‌ పాటిస్తూ పారిస్‌ ఒలింపిక్స్‌లో కొందరు ట్రాన్స్‌ జెండర్‌ అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) కీలక గైడ్‌లెన్స్‌ను విడుదల చేసింది. ట్రాన్స్‌ జెండర్‌ అథ్లెట్లను పిలిచేటప్పుడు, పలికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వీరిని సంభోదించే అప్పుడు సమస్యాత్మకమైన.. ఇబ్బందికరమైన వ్యాఖ్యానం చెయ్యొద్దని సూచించింది.





 

మూస పద్ధతులు వద్దు

జెండర్‌లతో పిలిచే వాటికి స్వస్తి పలకాలని సూచించింది. మూస పద్ధతులను వీడి కొత్త పద్దతులను అలవాటు చేసుకోవాలని సూచించింది. స్పోర్ట్స్‌మ్యాన్, కెమెరామెన్. అనే పదాలు వాడకుండా స్పోర్ట్స్‌ పర్సన్‌, కెమెరా ఆపరేటర్‌ అని వాడాలని.. భార్య, భర్త అని పిలవకుండా భాగస్వామి అని పిలవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. రిపోర్టింగ్‌ చేసేటప్పుడు కూడా అందరూ సమానం అనేలా భావం ఉండాలని  అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సూచించింది. లింగమార్పిడి చేసుకున్న క్రీడాకారులు, అథ్లెట్లలపై ఎలాంటి వివక్షలను సహించేది లేదని వివరించింది. లింగమార్పిడి చేసుకున్న అథ్లెట్లు, బయోలాజికల్లీ స్త్రీ, పురుషుడు వంటి జుగుప్సాకరమైన భాష వాడొద్దని సూచించింది. మేల్-టు-ఫిమేల్, ఫిమేల్-టు-మేల్ వంటి పదాలు వాడడం వల్ల క్రీడాకారులు, అథ్లెట్‌ల బాధను వర్ణించలేమని... కాబట్టి ఆ భాషను వాడడం సరికాదని సూచించింది. 

 

తొలి మహిళ ఆమె...

వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ 2021లో జరిగిన టోక్యో 2020 గేమ్స్‌లో ఒలింపిక్స్‌లో పాల్కొన్న మొదటి ట్రాన్స్ జెండర్‌ అథ్లెట్‌గా ఖ్యాతి గడించారు.  న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హ‌బ్బర్డ్ మ‌హిళ‌ల వెయిట్ లిఫ్టింగ్‌లో పోటీ చేశారు. అమెరికన్ స్విమ్మర్ లియా థామస్ కూడా ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో బరిలో నిలిచారు.