CAS dismisses Vinesh Phogat's appeal for silver medal:  వినేశ్‌ ఫోగట్‌(Vinesh Phogat)కు భారీ షాక్‌ తగిలింది. పారిస్‌  ఒలింపిక్స్‌లో కనీసం తనకు రజత పతకం అన్న ఇవ్వాలిన్న వినేశ్‌ ఫోగట్‌ అప్పీల్‌ను కాస్‌ తిరస్కరించింది. సిల్వర్‌  ఇవ్వాలన్న వినేశ్‌ అభ్యర్థనను కాస్‌ తోసిపుచ్చింది. వంద గ్రాముల అధిక బరువు ఉందంటూ ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ వినేశ్‌ ఫొగాట్‌పై నిషేధం విధించింది. దీనిని వినేశ్‌ కాస్‌లో సవాల్‌ చేయగా అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 






భారత అభిమానుల  హృదయం ముక్కలైంది. భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ ఏదో ఒక పతకంతో భారత్‌లో అడుగు పెడుతుందన్న ఆశలు.. నిర్వీర్యమైపోయాయి. ఒలింపిక్ అనర్హతపై వినేష్ ఫోగట్ చేసిన అప్పీల్‌ను కాస్‌ తిరస్కరించింది. విశ్వ క్రీడల్లో పైనల్‌కు చేరిన తర్వాత తనపై అనర్హత వేటు వేయడంపై భారత స్టార్‌ రెజ్లర్ వినేష్ ఫోగట్... కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. అయితే వినేశ్‌ ఫొగాట్‌ అప్పీల్‌ను కాస్‌ తిరస్కరించిందని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. గత వారం మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్‌లో వినేష్ ఫొగాట్‌పై 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటు పడింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన దరఖాస్తును కాస్‌ తిరస్కరించిందని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ PT ఉష(PT Usha) ఒక ప్రకటనలో తెలిపారు. కాస్‌ తీర్పుపై  ఉష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  వినేష్ విజ్ఞప్తిని తిరస్కరించడం వల్ల పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు కలిపి ఆరు పతకాలు మాత్రమే దక్కినట్లు అయింది. 






 


ఈ విషయంపై బాక్సర్ విజయేంద్ర సింగ్ స్పందించారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. వినేశ్ పోటీపడి ఉంటే భారత్ కు ఖచ్చితంగా స్వర్ణం వచ్చి ఉండేదన్న నమ్మకం వ్యక్తం చేశారు.    తాను గతంలోనే కాదు భవిష్యత్తులో కూడా  వినేష్ కు మద్దతుగానే ఉంటామన్నారు. 






 


అభిమానులకు నిరాశ:


కాస్‌ తీర్పుతో భారత క్రీడా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పారిస్‌ విశ్వ క్రీడల్లో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఏదో ఒక పతకంతో భారత్‌లో అడుగు పెడుతుందని అంతా భావించారు. అయితే కాస్‌ తీర్పు  భారత అభిమానుల ఆశలకు వ్యతిరేకంగా వచ్చింది. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకూ ఓటమంటే ఎరుగని ప్రపంచ నెంబర్‌ వన్‌ రెజ్లర్‌ను ఓడించిన వినేశ్ ఫొగాట్‌కు కచ్చితంగా స్వర్ణం వస్తుందని అంతా భావించారు. అయితే ఈ ఆశలు నెరవేరలేదు. కేవలం వంద గ్రాముల బరువుతో వినేశ్‌ పతకాన్ని కోల్పోవడం అశేష భారతావని జీర్ణించుకోలేకపోతోంది. పతకం సాధించకపోయినా వినేశ్‌.. ఛాంపియనే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, ప్రిన్స్‌ సౌరవ్‌ గంగూలీ ఇప్పటికే వినేశ్‌కు మద్దతు ఇచ్చారు. అయినా కాస్ తీర్పు మాత్రం భారత్‌కు వ్యతిరేకంగా వచ్చింది.