Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. శుక్రవారం రోజు జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికీ 288 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈఘటనలో ఏపీకి చెందిన వాళ్లే 50 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగతున్నాయి. ఈక్రమంలోనే రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. సంతాపం తెలుపుతున్నారు. 






ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసి తాను చాలా బాధపడినట్లు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వవరించారు. 






ఒడిసాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా తెలిపారు. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 






ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన బాధాకరమైన రైలు ప్రమాదంలో 200 మందికి పైగా ప్రయాణికులు అకాల మరణం చెందారనే వార్త తనను ఎంతగానో బాధించిందని రెజ్లర్ బబిత ఫోగట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మృతుల ఆత్మలకు శాంతి కల్గాలని, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు. ఈమెతో పాటు నీరజ్ చోప్రా, అభినవ్ బింద్రా కూడా తమ సంతాపాన్ని తెలిపారు. 






ఒడిశాలో జరిగిన ఘోర విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు అభినవ్ బింద్రా తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి కల్గడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ఈ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.