IBA Womens World Boxing: తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ అద్భుతం చేసింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఫైనల్ చేరిన తొలి అమ్మాయిగా రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల 52 కిలోల సెమీస్‌లో బ్రెజిల్ బాక్సర్ కరోలిన్ డి అల్మెయిడాను 5-0తో ఓడించింది. ఆఖరి వరకు ప్రశాంతంగా ఆడిన నిఖత్ భారత్ కనీసం రజతం ఖాయం చేసింది. ఈ పోటీలు ఇస్తాంబుల్‌లో జరుగుతున్నాయి.
భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రపంచ బాక్సింగ్‌లో పంచ్ మెషీన్‌గా పిలుస్తుంటారు. కొన్నేళ్లుగా ఆమె అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది. 52 కిలోల విభాగంలో పతకాలు తీసుకొస్తోంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్‌కు ఛార్లె సియాన్‌ను 5-0తో ఓడించి తొలి పతకం ఖాయం చేసింది. ఇప్పుడు ఫైనల్ చేరుకొని పసిడిపై ఆశలు పెంచింది. జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆమె పతకాలు తీసుకురావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభం నుంచీ నిఖత్ మంచి ఫామ్‌లో ఉంది. స్ట్రాండ్ మెమోరియల్ టోర్నమెంటులో పసిడి పతకం సొంతం చేసుకుంది.
ఈ టోర్నీలో భారత బాక్సర్లు పర్వీన్ (63 కిలోలు), మనీషా (57 కిలోలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. సెమీ ఫైనల్ మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు.