ఒలింపిక్స్ అనగానే భారత ప్రజలకు గుర్తుకొచ్చేది ఈసారైనా స్వర్ణ పతకం ఎవరైనా సాధిస్తారా.. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో పథకం కోసం కళ్లు కాయలు కాచేలా చూసిన దేశానికి నీరజ్ చోప్రా రూపంలో సమాధానం లభించింది. -అథ్లెటిక్స్ విభాగంలో భారత్ 100ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నిరజ్ చోప్రా తెరదించాడు. దాంతో ఓవర్ నైట్ అతడు దేశంలో స్టార్‌గా మారిపోయాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశానికి అతడు స్వర్ణ పతకం అందించాడు. జావెలిన్ త్రో విభాగంలో మహాహులను వెనక్కి నెట్టిన నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని అందించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.
ఒలింపిక్ గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించిన భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడచూసిన నీరజ్ చోప్రా సాధించిన ఘనత గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నీరజ్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య గత 24 గంటల్లో భారీగా పెరిగింది. ఈ క్రమంలో కేవలం గడిచిన 24 గంటల్లో 10 లక్షల మంది కొత్త ఫాలోయర్లను నీరజ్ చోప్రా సొంతం చేసుకున్నాడు.
శనివారం సాయంత్రం టోక్యోలో జరిగిన జావెలిన్ త్రో విభాగంలో అత్యధిక దూరం విసిరి స్వర్ణాన్ని సొంతం చేసుకున్న అనంతరం అతడి విజయంపై విశేష స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో 1 మిలియన్ ఫాలోయర్లు కొత్తగా నీరజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అయ్యారు. దీంతో ఒలింపిక్స్ స్వర్ణ పతకం విలువ ఏ పాటిదో క్రీడల గురించి అవగాహన లేనివారికి సైతం అర్థమై ఉంటుంది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం సాధించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు.
Also Read: Neeraj Chopra Wins Gold: నీరజ్ చోప్రాకు స్వర్ణం... వందేళ్ల భారత నిరీక్షణకు తెర... అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్
టోక్యో ఒలింపిక్స్‌లో తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందించేంత దూరం జావెలిన్ విసిరి తన ఆకాంక్షను నెరవేర్చుకున్నాడు. కోట్లాది భారతీయుల ఎదురుచూపులకు తెరదించాడు నీరజ్ చోప్రా. 23 ఏళ్ల నీరజ్ చోప్రా ఈటెను ఏకంగా 87.58మీటర్లు విసిరి స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం తెలిసిందే. మరో విశేషం ఏంటంటే.. ఫైనల్లో విసిరిన రెండో అత్యధిక దూరం సైతం ఈ భారత యువ సంచలనం పేరిటే ఉండటం విశేషం. హర్యానా ప్రభుత్వం 6 కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం నీరజ్ చోప్రాకు నగదు బహుమతి ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.
Also Read: Aditi Ashok, Golf Olympics: యావత్ భారతావనిని కదిలించిన అదితి అశోక్.. స్ఫూర్తిని రగిలించిన యువ సంచలనం