2024 పారిస్ ఒలింపిక్స్‌కు నీరజ్ చోప్రా క్వాలిఫై అయ్యాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కోసం ప్రస్తుతం క్వాలిఫికేషన్ రౌండ్స్ జరుగుతున్నాయి. వీటిలో తన మొదటి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా ఏకంగా 88.77 మీటర్ల దూరం విసిరాడు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కోసం జరుగుతున్న క్వాలిఫికేషన్ రౌండ్స్‌లో నీరజ్ చోప్రా గ్రూప్-ఏలో ఉన్నాడు. ఈ క్వాలిఫయింగ్ రౌండ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం అయింది.


2024 పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ మార్కు 85.5 మీటర్లుగా ఉంది. నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు విసిరాడు. టోక్యో ఒలంపిక్స్‌లో నీరజ్ చోప్రా వ్యక్తిగత బెస్ట్ 89.94గా ఉంది. 2022 జూన్ 30వ తేదీన స్టాక్ హోం డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా ఈ మార్కును చేరుకున్నాడు. ఇక వరల్డ్ ఛాంపియన్ షిప్ విషయానికి వస్తే... గ్రూప్ ఏ, గ్రూప్ బిల నుంచి 12 మంది ఫైనల్ రౌండ్ ఆడనున్నారు. ఈ ఫైనల్ ఆదివారం జరగనుంది.


దీంతోపాటు 2023 జూన్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ చోప్రా 87.66 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించాడు. గాయం తర్వాత మళ్లీ ఆట ప్రారంభించిన నీరజ్‌ చోప్రాకు ఇది మంచి ప్రారంభం. నీరజ్ వేసిన మొదటి ప్రయత్నం ఫౌల్ అయింది. కానీ వెంటనే కోలుకున్న నీరజ్ చోప్రా తన బెస్ట్ ఇచ్చి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 


ఫస్ట్‌ త్రోలో జర్మనీకి చెందిన వెబర్‌ 86.20 మీటర్లు విసిరాడు. కానీ నీరజ్ చోప్రా ఫస్ట్‌ ప్రయత్నం విఫలమైంది. రెండో ప్రయత్నంలో 83.52 మీటర్లు, మూడో ప్రయత్నంలో 85.04 మీటర్లు విసిరాడు. కానీ ఆ తర్వాత నాలుగో ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక మిగిలిన ఆఖరి అవకాశాన్ని నీరజ్ చోప్రా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆఖరి ప్రయత్నంలో ఊహించని విధంగా 87.66 మీటర్ల త్రో విసిరాడు. అయితే తన ఆఖరి ప్రయత్నంలో జర్మనీ ఆటగాడు వెబర్‌ 87.03 మీటర్‌లు మాత్రమే త్రో చేయగలిగాడు. దీంతో నీరజ్‌ చోప్రా విజయం ఖాయం అయింది. దీంతో బంగారు పతకం నీరజ్ చోప్రా సొంతమైంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన యాకోబ్ వాడ్లెజ్చే మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. నీరజ్ చోప్రా కెరీర్‌లో ఇది ఎనిమిదో స్వర్ణం. 2023 సంవత్సరం డైమండ్ లీగ్‌లో అతడికిది రెండో స్వర్ణం. గతంలో దోహా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. 







Also Read: ఆసియాకప్‌ ముంగిట కోహ్లీ సైలెంట్‌ వార్నింగ్‌! 17.2 స్కోర్‌ చేసేశాడోచ్‌!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial