National Sports Awards 2023: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఖేల్ రత్న, ద్రోణాచర్య, అర్జున అవార్డు (Arjuna Awards 2023)లను ప్రకటించింది. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి (Chirag Shetty), ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్‌ (Satwiksairaj Rankireddy) లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Major Dhyan Chand Khel Ratna Award)ను ప్రకటించారు. క్రీడల్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 26 మందిని అర్జున అవార్డు వరించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది. 


అయిదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. అత్యుత్తమ కోచ్ లు లలిత్ కుమార్ (రెజ్లింగ్), రమేష్ (చెస్), మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్)లను ద్రోణాచార్య వరించింది. కేంద్ర జాతీయ క్రీడా అవార్డులను జనవరి 9, 2024న రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అందజేయనున్నారు.  


మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 గ్రహీతలు
1. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి (బ్యాడ్మింటన్)
2. రంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ (బ్యాడ్మింటన్)


అర్జున అవార్డులు 2023 విజేతలు వీరే..
1. ఓజస్ ప్రవీణ్ డియోటలే (ఆర్చర్)
2. అదితి గోపీచంద్ స్వామి (ఆర్చర్)
3. ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్)
4. పారుల్ చౌదరి (అథ్లెటిక్స్)
5. మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)
6. ఆర్ వైశాలి (చెస్)
7. మహ్మద్ షమీ (క్రికెట్)
8. అనూష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్)
9. దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్)
10. దీక్షా దాగర్ (గోల్ఫ్)
11. క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ)
12. సుశీల చాను (హాకీ)
13. పవన్ కుమార్ (కబడ్డీ)
14. రీతు నేగి (కబడ్డీ)
15. నస్రీన్ (ఖో-ఖో)
16. పింకి (లాన్ బౌల్స్)
17. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
18. ఈషా సింగ్ (షూటింగ్)
19. హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్)
20. అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
21. సునీల్ కుమార్ (రెజ్లింగ్)
22. ఆంటిమ్ (రెజ్లింగ్)
23. నౌరెమ్ రోషిబినా దేవి (వుషు)
24. శీతల్ దేవి (పారా ఆర్చరీ)
25. ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)
26. ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్)


అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు 2023..
1. లలిత్ కుమార్ (రెజ్లింగ్)
2. R. B. రమేష్ (చెస్)
3. మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్)
4. శివేంద్ర సింగ్ (హాకీ)
5. గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్)


సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ బ్యాడ్మింటన్ లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఈ బ్యాడ్మింటన్ జోడీ ఈ ఏడాది మూడు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (Badminton World Federation) టైటిల్స్ సాధించింది. స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, కోరియా ఓపెన్ టైటిల్స్ సాధించారు. హంగ్జౌలో జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించారు. ఈ ప్రదర్శనతో వీరికి అత్యుత్తమ క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కేంద్రం ప్రకటించింది.