Amritpal Singh Shot Dead:
అమృత్ పాల్ సింగ్ హతం..
పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అమృత్ పాల్ సింగ్ హతమయ్యాడు. అమృత్‌సర్‌లో పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయాడు. చాలా రోజులుగా పోలీస్‌ల కస్టడీలో ఉన్న అమృత్ పాల్‌ని ఓ ప్రాంతానికి తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫైరింగ్ మొదలు పెట్టారు. ఆ సమయంలోనే అమృత్ పాల్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రగాయాల పాలైన అమృత్‌ని హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
అమృత్ పాల్ సింగ్ డ్రగ్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నాడు. పెద్ద ఎత్తున హెరాయిన్‌తో పాటు ఆయుధాలనూ సప్లై చేస్తున్నాడు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు అమృత్ పాల్‌ని అమృత్‌సర్‌కి తీసుకెళ్లారు. ఆ ప్రాంతానికి వెళ్లగానే అమృత్ పాల్ కాల్పులు మొదలు పెట్టాడు. ఆ సమయంలోనే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది.
"మా విచారణలో అమృత్ పాల్ సింగ్ తన వద్ద 2 కిలోల హెరాయిన్ ఉందని చెప్పాడు. ఆ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ఆ డ్రగ్స్‌లోనే ఓ గన్ ఉంది. వెంటనే ఆ గన్‌తో ఫైరింగ్ చేశాడు. ఈ కాల్పుల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు"
- సతీందర్ సింగ్, సీనియర్ ఎస్‌పీ
37 రోజుల పాటు ఛేజింగ్..
ఈ ఏడాది మార్చిలోనే పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ని అరెస్ట్ చేయాలని చూశారు. అప్పటి నుంచి దాదాపు 37 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. అప్పటి వరకూ అమృత్ పాల్ చాలా చోట్ల సీసీ కెమెరాల్లో కనిపించాడు. రకరకాల వేషాలు వేసి తిరిగాడు. ఓ చోట సూటు బూటు వేసుకుని కనిపించాడు. మరో చోట పూర్తిగా మాస్క్ పెట్టుకుని తిరిగాడు. పటియాలా, కురుక్షేత్ర, ఢిల్లీ..ఇలా చాలా చోట్లకు మకాం మార్చాడు. నేపాల్‌కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. పోలీసులు అరెస్ట్ చేసేలోగా దాదాపు 10 సిటీల్లో మారు వేషాల్లో తిరిగాడు అమృత్ పాల్. 9 మంది సన్నిహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఈ ఛేజ్ ముగిసింది. ఏప్రిల్ 23న అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు మోగాలోని గురుద్వారా నుండి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో 36 రోజుల పోలీసుల అన్వేషణకు తెరపడింది.
Also Read: అడిగిన వెంటనే టీ ఇవ్వలేదని వాగ్వాదం, భార్య తల నరికి చంపిన భర్త