Mithali Raj Retirement Know Facts of Unbeatable records of Women Cricketer Mithali Raj : మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ (Mithali Raj) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసింది. అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆమె 'లేడీ సచిన్ తెందుల్కర్'గా పేరుగాంచింది. మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో మిథాలీ అగ్రస్థానంలో ఉంటుంది. 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20ల్లో వరుసగా 699, 7805, 2364 పరుగులు చేసింది. వన్డేల్లో 8 వికెట్లు తీసి సర్‌ప్రైజ్ చేసింది. కెరీర్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అందులో కొన్ని మీకోసం!
మిథాలీ రికార్డులు
* అమ్మాయిల టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం ఆడిన రెండో క్రికెటర్ మిథాలీ. 19 ఏళ్ల 262 రోజులు ఆడింది.
* అమ్మాయిల క్రికెట్లో అతి చిన్న వయసులోనే పగ్గాలు అందుకున్న మూడో క్రికెటర్. 22 ఏళ్ల 253 రోజులకే టెస్టులకు సారథ్యం వహించింది.
* బ్యాటింగ్ పొజిషన్‌ను బట్టి ఒక ఇన్నింగ్సులో ఎక్కువ పరుగులు చేసిందీ మిథాలీయే. టెస్టు క్రికెట్లో 214 పరుగులు చేసింది.
* అతి చిన్న వయసులోనే డబుల్ సెంచరీ కొట్టిన ఏకైక వనిత. 19 ఏళ్ల 254 రోజులప్పుడు డబుల్ సెంచరీ కొట్టేసింది.
* ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిందీ మిథాలీయే. 157 పరుగుల భాగస్వామ్యం అందించింది.
* వన్డే క్రికెట్లో సుదీర్ఘ కాలం ఆడిన ఏకైక క్రికెటర్ మిథాలీ. 22 ఏళ్ల 274 రోజులు ఆడింది.
* అత్యధిక వన్డే మ్యాచులకు కెప్టెన్సీ చేసిందీ మిథాలీయే. 155 వన్డేలకు నాయకత్వం వహించింది. మరెవ్వరికీ ఈ రికార్డు లేదు.
* మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డూ మిథాలీదే. 7805 రన్స్ చేసింది.
* మహిళల వన్డేల్లో అరంగేట్రంలోనే సెంచరీ (114 *) అమ్మాయి మిథాలీ. 16 ఏళ్ల 205 రోజులకే కొట్టి అతి చిన్న వయసులో సెంచరీ రికార్డు కొట్టేసింది.
* వన్డే క్రికెట్లో ఎక్కువ సార్లు 90ల వద్ద ఔటైన క్రికెటర్ మిథాలీ. ఐదుసార్లు అయింది.
* మహిళల వన్డేల్లో వరుసగా 7 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్ మిథాలీ రాజ్.
* రెండు డకౌట్ల మధ్య ఎక్కువ ఇన్నింగ్సులు ఆడిన రెండో క్రికెటర్ మిథాలీ. 74 ఆడింది.
* టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన రెండో క్రికెటర్ మిథాలీ. 70 మ్యాచుల్లో చేసింది.