'విక్రమ్' విజయం లోక నాయకుడు కమల్ హాసన్‌కు అమితానందాన్ని కలిగిస్తోంది. ఆ ఆనందాన్ని ఆయన బహుమతుల రూపంలో తెలియజేస్తున్నారు. సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది చాలా మందికి స‌ర్‌ప్రైజ్‌ కలిగించింది. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... 'విక్రమ్'కు దర్శకత్వ శాఖలో పని చేసిన 13 మందికి బైకులను బహుమతిగా ఇచ్చారు. అపాచీ ఆర్‌టిఆర్‌ 160 బైక్స్ కొన్నారు. 


'విక్రమ్' విజయంలో దర్శకుడు, సహాయ దర్శకుల పాత్ర ఎంతో ఉందని... వాళ్ళకు కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని కారు, బైకులు కొన్నట్టు కమల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, థాంక్స్ గివింగ్ పార్టీ కూడా ఇచ్చారు.  


ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పినట్టు... ఒక్క సినిమాతో కమల్ హాసన్‌కు రెండు లాభాలు కలిగాయి. కథానాయకుడిగా కమల్‌కు యాక్షన్ ఇమేజ్ వచ్చింది. గతంలో ఆయన యాక్షన్ సినిమాలు చేశారు. అయితే... ఈ వయసులోనూ యాక్షన్ చేయగలరని, చేసి విజయాలు అందుకోగలరని 'విక్రమ్' ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. భారీ వసూళ్లు వస్తుండటంతో కమల్ హ్యాపీగా ఉన్నారు. 


Also Read: భారీ ఓటీటీ ఆఫర్ రిజెక్ట్ చేసిన 'ఎఫ్ 3' టీమ్ - కోట్లు ఇస్తామని చెప్పినా...


తెలుగులో 'విక్రమ్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను హీరో నితిన్ తండ్రి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి రూ. 6 కోట్లకు కొనుగోలు చేశారు. నాలుగు రోజుల్లో ఆ వసూళ్లు వచ్చాయి. ఇకపై వచ్చే వసూళ్లు ఆయనకు లాభమే.


Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ