టీమిండియా ఆటగాడిగా ఉన్న సమయంలో ఎంత దూకుడును ప్రదర్శించాడో.. రిటైర్మెంట్ తరువాత సైతం మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. ఇటీవల కరోనా వైరస్ కేసుల కారణంగా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన 5వ టెస్టు వాయిదా వేశారు. తరువాత ఈ టెస్ట్ మ్యాచ్ రీషెడ్యూల్ చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును బీసీసీఐ కోరడం తెలిసిందే.


టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేయడంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఐపీఎల్ 2021 ఆడేందుకు భారత క్రికెటర్లు చివరి టెస్టు నుంచి తప్పించుకుంటున్నారని, ఆటగాళ్లు అందుకే కీలకమైన టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయడాన్ని ఇర్ఫాన్ పఠాన్ తప్పుపట్టాడు. తనదైన శైలిలో వారికి సోషల్ మీడియా వేదికగా బదులిచ్చాడు.  అయ్యో పొరపాటున నా దంతాలు ఊడిపోయాయి. అందుకు నేను కూడా ఐపీఎల్‌నే నిందించాలా? ఈజీ టార్గెట్ అంటూ తనదైన శైలిలో ఇర్ఫాన్ పఠాన్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ రిప్లై అదిరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Also Read: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 ఫేజ్-2.. ఈ 7 విషయాలు మీకు తెలుసా!






ఐపీఎల్ 2021 ఫేజ్ 2 మ్యాచ్‌ల ప్రారంభానికి ఇంగ్లాండ్, టీమిండియా 5వ టెస్టు అడ్డంకిగా మారింది. మరోవైపు టీమిండియా కోచ్ రవిశాస్త్రికి, టీమ్ సహాయక సిబ్బందికి సైతం కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు నిర్వహించిన కొవిడ్ టెస్టులలో వారికి నెగెటివ్‌గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. టెస్ట్ సిరీస్ లో ఇదివరకే 2-1 తో భారత్ ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు నెగ్గి 3-1తో సిరీస్ సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ సేన భావించింది.


Also Read: చరిత్ర సృష్టించిన ఎమ్మా రదుకాను... 18 ఏళ్లకే యూఎస్ గ్రాండ్ స్లామ్... ఫైనల్ లో వరుస సెట్లలో ఘన విజయం


మాంచెస్టర్ టెస్టు జరిగితే విజయం సాధించి సిరీస్ ను 2-2తో డ్రా చేసుకుని పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ అనుకుంది. కానీ ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభంలో క్వారంటైన్ సమయం సరిపోదని భావించిన తరుణంలో చివరి టెస్టును తాత్కాలికంగా వాయిదా వేశారు. వీలైతే ఆ టెస్టును రీషెడ్యూల్ చేయాలని ఈసీబీని బీసీసీఐ కోరింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ కోసం కీలకమైన టెస్టును టీమిండియా వదులుకుందంటూ చవకబారు కామెంట్లు చేశారు. ఆ టెస్టును కచ్చితంగా ఆడతామని, అయితే ఐపీఎల్ 2021 సీజన్ పూర్తయ్యాక నిర్వహించాలని అధికారులు కోరారు.


Also Read: ఐపీఎల్ రెండో ద‌శ అస‌లు జ‌రిగే అవ‌కాశం ఉందా? మళ్లీ కరోనా భయపెడుతుందా?