కేరళ కోజికోడ్ లో గతేడాది జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రమాదానికి గల కారణాలను వివరంగా తెలిపారు. పైలెట్ ఎస్ఓపీ (స్టాండెడ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను సరిగా అమలు చేయకపోవడంతో పాటు పరికరాల మోరాయింపు కూడా ఈ ప్రమాదానికి ఓ కారణంగా నివేదికలో పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో పైలెట్, కో-పైలెట్ సహా 21 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 186 మంది ప్రయాణికులున్నారు. చాలా మందికి గాయాలతో తప్పించుకున్నారు.
పైలెట్ తప్పిదం..
- ఏఏఐబీ నివేదిక ప్రకారం, పైలెట్ తీసుకున్న అస్థిర నిర్ణయాలే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
- విమానాన్ని టచ్ జోన్ (నేలపైకి దిగాల్సిన ప్రదేశం) దాటి సగం రన్‌వేలోకి వెళ్లి ల్యాండ్ చేయడం వంటి తప్పులను పైలెట్ చేశారు.
- అంతేకాదు. 'పైలట్ మానిటరింగ్' నుంచి 'గో అరౌండ్'(గాల్లో చక్కర్లుకొట్టమని) చేసిన సూచనలను అమలు చేయలేకపోవడం కూడా మరో కారణం.
- కొజీకోడ్ విమానాశ్రయంలో వాతావరణం సరిగా లేని సమయంలో ఎన్నో సార్లు విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్ అనుభవం.. అతి ఆత్మవిశ్వాసానికి కారణమైందని నివేదిక పేర్కొంది.
Also Read: BKU Leader Rakesh Tikait: ఎండైనా, వానైనా తగ్గేదేలే.. వరద నీటిలో టికాయత్ వినూత్న నిరసన
అంచనాలో వైఫల్యం..
ఒక సారి రన్‌వే 28పై ల్యాండింగ్‌కు విఫలయత్నం చేసిన తర్వాత కూడా పైలట్ ఇన్ కమాండ్.. ముప్పును సరిగా అంచనా వేయలేదు. తగినంత ఇంధనం ఉన్నా వెంటనే రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. ఇది ఎస్‌ఓపీ ఉల్లంఘన కిందకు వస్తుంది.
టెయిల్ విండ్ పరిస్థితుల్లో భారీ వర్షం పడుతున్న టేబుల్‌టాప్ రన్‌వే పై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి విమానం ప్రమాదానికి గురైంది.
Also Read: హార్ట్ ఎటాక్ vs కార్డియాక్ అరెస్ట్: గుండె జబ్బులు లేకపోయిన హృదయం ఆగుతుంది.. ఎందుకో తెలుసా?
మోరాయింపు..
పైలట్ ఇన్ కమాండ్ స్థానంలో కూర్చున్న వైపు ఉన్న విండ్ షీల్డ్ వైపర్ మొరాయించింది. తొలిసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో ఆగిపోయింది. ఇది కూడా ప్రమాదానికి ఓ కారణంగా నివేదికలో పేర్కొన్నారు.
Also Read: Gujarat New CM: గుజరాత్ కొత్త సీఎం కోసం భాజపా వేట.. రేస్ లో ఆ నలుగురు