గత ఏడాది యూఏఈ వేదికగా నిర్వహించడంతో ఐపీఎల్ 2020 ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తయింది. కానీ ఈ ఏడాది భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్ 2021 నిర్వహణ లోపంతో కరోనా కేసులు వచ్చాయి. సగం మ్యాచ్‌ల అనంతరం సీజన్ ను మధ్యలోనే నిలిపివేశారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు నేటికి ప్రపంచంలో పలు దేశాలు కరోనా మహమ్మారి సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరో 7 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సీజన్ గురించి 7 ఆసక్తికర విషయాలు మీకు అందిస్తున్నాం.
బంతులు మార్పు..
గతంలో బంతులు స్టాండ్స్ లోకి వెళ్తే మళ్లీ అదే బంతిని తెచ్చి ఆటను కొనసాగించేవారు. కానీ ప్రస్తుతం జరగనున్న మ్యాచ్‌లలో బంతి స్టాండ్స్‌కు వెళ్తే కొత్త బంతితో ఆటను కొనసాగిస్తారు. ఆ బంతిని శానిటైజ్ చేసి బాల్ లైబ్రరిలో సేవ్ చేస్తారు.
Also Read: ఐపీఎల్ రెండో దశ అసలు జరిగే అవకాశం ఉందా? మళ్లీ కరోనా భయపెడుతుందా?
లాలాజలం వాడకం నిషేధం..
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో లాలాజలం వాడకంపై ఆంక్షలు విధించారు. బౌలర్లు బంతికి లాలాజలాన్ని రుద్దకూడదు. గత ఐపీఎల్ లోనూ లాలాజలం వాడకాన్ని నిషేధించడం తెలిసిందే. ఈ సీజన్లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎవరైనా బౌలర్ లేదా ఫీల్డర్ పదే పదే బంతికి లాలాజలాన్ని రుద్దితే 5 పరుగుల పెనాల్టి విధిస్తారు.
బయోబబుల్ ఆంక్షలు
సీజన్ మధ్యలో కరోనా కేసులు రావడంతో తలెత్తిన సమస్యలు మరోసారి ఉత్పన్నం కాకుండా నిర్వాహకులు కఠిన బయోబబుల్ ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసర సమయంలో ఆటగాళ్లు బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనుమతి తీసుకుని బయోబబుల్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
గ్రీన్ జోన్
ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస చేసే హోటల్స్ లో వీరి కోసం ప్రత్యేకమైన చెక్ ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.
కొవిడ్19 టెస్టులు తప్పనిసరి..
బబుల్ లోకి రాకుముందే ఆటగాళ్లు ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తారు. వారం రోజులు కొవిడ్ టెస్టులు చేసి, వాటి ఫలితాలు వచ్చాక ఆటగాళ్లను జట్టుతో చేర్చుతారు. పాజిటివ్ వచ్చిన వారిని మిగతా ఆటగాళ్లకు దూరంగా ఐసోలేషన్ లో ఉంచనున్నారు.
బబుల్ ఇంటిగ్రిటి మేనేజర్స్..
ఆటగాళ్లు సురక్షితంగా ఉండేందుకు, కొందరి నిర్లక్ష్యం కారణంగా జట్టు మొత్తం కరోనా బారిన పడకుండా చూడటంలో భాగంగా నలుగురు బబుల్ ఇంటిగ్రిటి మేనేజర్లు ఉంటారు. ఆటగాళ్లకు హోటల్స్ బుక్ చేయడం దగ్గర్నుంచీ వారు మైదానానికి వెళ్లే వరకు జరిగే ప్రక్రియలో ప్లేయర్స్ ఎవరినీ కలుసుకోకుండా చూడం వీరి బాధ్యత.
వన్ హోటల్.. వన్ టీమ్..
ఐపీఎల్ 2021 ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్లకు ఒక్కో హోటల్‌లో బస ఏర్పాటు చేయనున్నారు. వీలైతే హోటల్ మొత్తాన్ని బుక్ చేసుకోవాలని యోచిస్తున్నారు. అలా కుదరని పక్షంలో కనీసం ఫ్లోర్ అయినా ఒక్కో జట్టు కోసం తీసుకోవాలని ప్లాన్ చేశారు. బయటి వ్యక్తులను కలుసుకోకుండా ఉండటంలో భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్వారంటైన్ తప్పనిసరి..
టీమిండియా క్రికెటర్లు యూకే నుంచి యూఏఈకి ప్రయాణించాలి. వీరితో పాటు భారత్ లో ఉన్న ఆటగాళ్లు సైతం యూఏఈకి రావాలి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు ఆరు రోజుల క్వారంటైన్ తప్పనిసరి. ముంబై ఇండియన్స్ కు చెందిన కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా శనివారం ఉదయం తమ కుటుంబసభ్యులతో అబు దాబి చేరుకున్నారు. సీఎస్కే, పంజాబ్ కింగ్స్ ప్రత్యేక విమానాలలో మాంచెస్టర్ నుంచి యూఏఈకి చేరుకుంటారు.
Also Read: T20 World Cup: రషీద్ ఖాన్ అలక... కొత్త కెప్టెన్‌గా మహ్మద్ నబీ... ప్రకటించిన ACB