'మా' ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో అయిపోనట్టనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఎన్నికల హడావుడి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది.  అధ్యక్ష పీఠం కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు విందు రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్ లోని ఓ పంక్షన్ హాల్ లో విందు ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్రించుకుందాం.. అంటూ ఓ మెసేజ్ ను ప్రకాశ్ రాజ్ పంపినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.


అయితే ఇటీవలే నరేశ్ కూడా పార్టీ ఇచ్చినట్లు సమాచారం.. నరేష్ తలపెట్టిన అన్ని కార్యక్రమాల్లోనూ వ్యతిరేకతను వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ పార్టీ విషయంలో మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పార్టీ ఇవ్వడంలో తప్పేముంది . పగలంతా కళాకారులు షూటింగ్ లో బిజీగా ఉంటారు. అందుకే రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నట్లున్నారని పంచ్ విసిరారు. ‘ఎన్నికల ప్రచారంలా ఇంటింటికి వెళ్లలేరు కదా అందుకే పరిచయస్తులందర్నీ పార్టీకి పిలుస్తారు, కలిసి భోజనం చేస్తారు, మందు కొడతారు.. ఇట్స్ ఓకే తప్పులేదు’  అన్నారు. నైట్ పార్టీలో ఎన్నో విషయాలు బయటకు వస్తాయని..ఎవరి సమస్యలు వారు చెప్పుకోవడానికి పార్టీ మంచి వేదికగా నిలుస్తుందని  చెప్పాడు. అయితే తాజగా ప్రకాశ్ రాజ్ కూడా పార్టీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ విందు పార్టీల వ్యవహారంపై బండ్ల గణేశ్ స్పందించారు. కళాకారులందర్నీ ఒకచోటకు చేర్చి వారి జీవితాలతో చెలగాటాలాడొద్దని అన్నారు. పోటీదారులందరూ తాము చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్‌ చేసి వివరించండి.. కానీ, విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అంటూ గణేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన గణేశ్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు.  


'విందులు, సన్మానాలు, పార్టీల పేరుతో ‘మా’ కళాకారులందర్నీ దయచేసి ఒకదగ్గరికి చేర్చకండి. గత రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ కరోనా భయంతోనే బతుకుతున్నారు. మీకు ఓటు కావాలనుకుంటే ఫోన్‌ చేసి మీరు చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్లకు చెప్పండి.  వాళ్ల జీవితాలతో చెలగాటాలాడొద్దు.. ఇదే నా విన్నపం’’ అని బండ్ల గణేశ్‌ ట్వీట్ చేశారు.


 



 


Also Read: MAA Election 2021: మోహన్ బాబు వ్యాఖ్యలపై నాగబాబు మండిపాటు.. దాని గురించి నరేష్-శివాజీలను అడగండి