Virat Kohli Vs Rilee Rossouw : ఒకప్పుడు మైదానంలో విరాట్ కోహ్లీ యాటిట్యూడే వేరు. సాధారణంగా సచిన్ లాంటి క్రికెటర్లు తమని ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వారికి నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్తారు. కానీ కోహ్లీ మాత్రం మైదానంలో ప్రత్యర్థులు రియాక్ట్ అయితే అక్కడికక్కడే ఇచ్చి పడేసుడే ఉండేది. తర్వాత బ్యాట్ బాదుడు కూడా ఉండేది అనుకోండి అది వేరే ముచ్చట. కానీ 2019-21 బ్యాడ్ ఫేజ్ తర్వాత కోహ్లీలో కాస్త మార్పు వచ్చింది. అగ్రెసివ్‌నెస్ కాస్త తగ్గించాడు. కానీ బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ పాత కోహ్లీ సరదాగా ఒక్కసారి అలా వచ్చి వెళ్లాడు.
ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ రిలీ రౌసో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక రిలీ రౌసో బ్యాట్‌ను గన్‌లా గాల్లోకి కాలుస్తున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ అప్పుడే ‘ఇది గుర్తుపెట్టుకో... తర్వాత మాట్లాడుకుందాం.’ అనుకున్నాడేమో. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక రిలీ రౌసో ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 27 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు సాధించాక కరణ్ శర్మ బౌలింగ్‌లో విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే రిలీ రౌసో అవుటవ్వగానే విరాట్ కోహ్లీ కూడా చేతుల్ని గన్‌లా పెట్టి కాలుస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.