Sanju Samson vs Hardik Pandya, Viral Video:
టీమ్‌ఇండియాకు కాబోయే కెప్టెన్ ఎవరంటే చాలామంది చెప్తున్న పేరు హార్దిక్ పాండ్య! కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచులో అతడి ప్రవర్తన చాలా మందికి నచ్చలేదు. ప్రత్యర్థి కెప్టెన్ సంజూ శాంసన్‌ను అతడు స్లెడ్జింగ్ చేసినట్టు తెలుస్తోంది. అతడి మాటలకు ఏ మాత్రం రెస్పాండ్ అవ్వని సంజూ... ఆ తర్వాత రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. కుంగ్‌ఫూ పాండ్యకు చేతలతోనే జవాబిచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
నరేంద్రమోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడ్డాయి. మొదట జీటీ 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌కు మెరుపు ఆరంభం దక్కలేదు. 4 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయింది. కీలకమైన యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్ పెవిలియన్‌కు చేరారు. ఇలాంటి టైమ్‌లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (60; 32 బంతుల్లో 3x4, 6x6) వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. టోర్నీ మొత్తం భయపెడుతున్న బౌలర్లను ఉతికి ఆరేశాడు.
పవర్ ప్లే ముగిశాక మహ్మద్ షమీ బౌలింగ్‌కు వచ్చినప్పుడు సంజూ శాంసన్‌ను (Sanju Samson) హార్దిక్ పాండ్య (Hardik Pandya) కవ్వించాడు. నేరుగా అతడి కళ్లలో కళ్లు పెట్టి చూశాడు. ఏవో మాటలు అన్నాడు. అందుకే సంజూ అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. సైలెంట్‌గా నిలబడ్డాడు. మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ రాగానే అటాక్ చేశాడు. 13వ ఓవర్లో 2,3,4 బంతులను నేరుగా స్టాండ్స్‌లో పెట్టాడు. దాంతో పాండ్యకు అద్దిరిపోయే రిప్లే ఇచ్చాడని అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ తరఫున సంజు శామ్సన్ (60: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, షిమ్రన్ హెట్‌మేయర్ (56 నాటౌట్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు.
గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1: 7 బంతుల్లో), జోస్ బట్లర్ (0: 5 బంతుల్లో) ఇద్దరూ విఫలం అయ్యారు. స్కోరు బోర్డుపై నాలుగు పరుగులు చేరే సరికి వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అయితే వన్‌డౌన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (26: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), సంజు శామ్సన్ (60: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు.
ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో రాజస్తాన్ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజు శామ్సన్, షిమ్రన్ హెట్‌మేయర్ (56 నాటౌట్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు)కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరు ఐదో వికెట్‌కు కేవలం 27 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. అనంతరం షిమ్రన్ హెట్‌మేయర్ ఎలాంటి పొరపాటు జరగకుండా మ్యాచ్‌ను ముగించాడు.