IPL 2024: MI vs SRH: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం హైదరాబాద్ సన్‌రైజర్స్(SRH)- ముంబయి ఇండియన్స్(MI) మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అభిమానుల సౌకర్యార్థం జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ మైదానానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇవి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై.. మ్యాచ్ అనంతరం తిరిగి రాత్రి 11.30గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
బుధవారం ముంబై vs హైదరాబాద్, ఏప్రిల్ 5న చెన్నై vs హైదరాబాద్, ఏప్రిల్ 25న బెంగుళూరు vs హైదరాబాద్, మే 2న రాజస్థాన్ vs హైదరాబాద్, మే 8న లక్నో vs హైదరాబాద్, మే 16న గుజరాత్ vs హైదరాబాద్, మే 19న పంజాబ్ vs హైదరాబాద్ మ్యాచులు జరుగుతాయి. ఈ ఏడు మ్యాచులను ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు.
ఘట్‌కేసర్, ఎన్టీవోస్ కాలనీ, జీడిమెట్ల, జేబీఎస్, చార్మినార్ నుంచి ఉప్పల్ స్టేడియానికి నాలుగు బస్సులు నడుపుతామని ఆర్టీసీ వెల్లడించింది. ఇక హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మిథాని ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, దిల్‌సుఖ్ నగర్, కేపీహెచ్‌బీ, మేడ్చల్, మియాపూర్, హకీంపేట్, ఈసీఎల్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్, బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి రెండు చొప్పున బస్సులను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి నడుపుతామని పేర్కొంది. ఇవి కాకుండా..ఉప్పల్ స్టేడియం నుంచి ఉప్పల్ డిపోకు చెందిన 4 బస్సులు మెహిదీ పట్నానికి నడుస్తాయి.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలు
• మెహదీపట్నం - స్టేడియం - 4 బస్సులు
• ఘట్‌కేసర్ - స్టేడియం - 4 బస్సులు
• హయత్ నగర్ - స్టేడియం - 2 బస్సులు
• NGIO కాలనీ - స్టేడియం - 4 బస్సులు
• ఇబ్రహీంపట్నం - స్టేడియం - 2 బస్సులు
• లాబ్ క్వార్టర్స్ - స్టేడియం - 2 బస్సులు
• కోటి - స్టేడియం - 2 బస్సులు
• అఫ్జల్ గంజ్ - స్టేడియం - 2 బస్సులు
• లక్డి కా పుల్ - స్టేడియం - 2 బస్సులు
• దిల్‌సుఖ్ నగర్ - స్టేడియం - 2 బస్సులు
• జీడిమెట్ల - స్టేడియం - 4 బస్సులు
• KPHB - స్టేడియం - 2 బస్సులు
• మేడ్చల్ - స్టేడియం - 2 బస్సులు
• మియాపూర్ - స్టేడియం - 2 బస్సులు
• JBS - స్టేడియం - 4 బస్సులు
• హకింపెట్ - స్టేడియం - 2 బస్సులు
• ECIL ఎక్స్ రోడ్స్ - స్టేడియం - 2 బస్సులు
• బోయింపల్లి - స్టేడియం - 2 బస్సులు
• చార్మినార్ - స్టేడియం - 4 బస్సులు
• చాంద్రాయణగుట్ట - స్టేడియం - 2 బస్సులు
• BHEL - స్టేడియం - 2 బస్సులు
• కొండాపూర్ - స్టేడియం - 2 బస్సులు
• ఎల్బి నగర్ - స్టేడియం - 2 బస్సులు