Top 5 Indian Uncapped Run-Scorers In IPL: ఐపీఎల్(IPL) లో మరో సీజన్ ముగిసిపోయింది. కప్ మనదే అనుకున్న తరుణంలో సన్ రైజర్స్(SRH) అభిమానులను నిరాశ పరిచినా ఐపీఎల్ 2024 ఐదుగురు అన్‌కేప్‌డ్‌(Indian Uncapped In IPL) ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్‌ను దేశానికి పరిచయం చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన  ఐదుగురు ఆటగాళ్లు తమ అసాధారణ ఆటతో అభిమానులను అలరించారు. మైదానంలో పరుగుల వరద పారించారు. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్ల తర్వాత వారి స్థానాలను భర్తీ చేయగలరనే భరోసాను ఇచ్చారు.


రియాన్ పరాగ్( Riyan Parag): 


ఈ సీజన్ లో సీనియర్ ఆటగాళ్ళ తరువాత చెప్పుకోవాలసిన వాళ్లలో మొదటి  ఆటగాడు రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాడైన రియాన్ పరాగ్ ఈసీజన్ లో అదరగొట్టాడు. 14 ఇన్నింగ్స్‌ ల్లో 573 పరుగులు చేసి తన పవర్ బ్యాటింగ్ సత్తాను చాటాడు. 52 సగటుతో ఆకట్టుకున్నాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌ లో 40 ఫోర్లు, 33 సిక్సర్లను బాది తన హిట్టింగ్ టాలెంట్‌ను చాటాడు. 


అభిషేక్ శర్మ (Abhishek Sharma):
2024 ఐపీఎల్ సీజన్ లో రెండో లీడింగ్ అన్‌కేప్‌డ్ ప్లేయర్ అభిషేక్ శర్మ. సన్ రైజర్స్‌ ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  ఫైనల్లో తప్పించి జట్టు అవసరాలకు తగినట్లు రాణించాడీ యువ ఆటగాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచ్ లు ఆడిన అభిషేక్ 484 పరుగులు చేశాడు. 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అతడికి ఈ సీజన్‌లో చేసిన పరుగులే అత్యధికం. ఈసారి 3 అర్థశతకాలు చేసిన అభిషేక్‌ 32 సగటుతో నిలకడగా రాణించాడు. ఆల్ రౌండర్ అయిన అభిషేక్ ఈ సీజన్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. 


శశాంక్ సింగ్(Shashank Singh ):
పంజాబ్‌ ఆటగాడు శశాంక్ సింగ్ ఈ సీజన్ లో తనలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటపెట్టాడు. 14 ఇన్నింగ్స్‌లలో 354 పరుగులతో రాణించాడు. 44 సగటుతో తానెంతో విలువైన ఆటగాడో చాటి చెప్పాడు. 


ప్రబ్‌ సిమ్రన్‌ సింగ్ (Prabhsimran Singh): 


పంజాబ్‌ జట్టులో ఉంటూ టాలెంట్ చాటుకున్న మరో ఆటగాడు ప్రబ్‌ సిమ్రన్‌ సింగ్. 14 ఇన్నింగ్స్‌ లలో 334 పరుగులు చేశాడు. ప్రబ్ మన్ సింగ్‌ సగటు 23గా ఉన్నప్పటికీ అతడి స్ట్రైక్ రేట్ 156గా ఉంది. 


అభిషేక్ పొరెల్‌ (Abishek Porel): 
ఈ సీజన్‌లో మరో అన్ కేప్‌డ్‌ ప్లేయర్ అభిషేక్ పొరెల్‌. ఢిల్లీ  కేపిటల్స్ ఆటగాడైన పొరెల్‌… చాలా పాజిటివ్ ధ్రుక్పథంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. పొరెల్ 12 ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేశాడు. ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు.


దేశంలో యంగ్ క్రికెట్ టాలెంట్‌కు ఏమాత్రం కొదవలేదు అనేందుకు వీరు మచ్చుతునక మాత్రమే. అనేక మంది క్రికెట్ ఆటగాళ్లు ఉన్న మన దేశంలో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ అద్భుత ఆటతీరుతో జట్టు అవసరాలను తీర్చడమే కాకుండా అభిమానులకు ఇష్టమైన ప్లేయర్లగా మారిపోయారు. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఇతర ఆటగాళ్లకు మరింత పోటీ ఇస్తున్నారు.