Rishabh Pant Replacement In IPL 2023: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ శుక్రవారం ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ సంఘటన తర్వాత రిషబ్ పంత్ బహుశా ఐపీఎల్ 2023 ఆడే అవకాశం లేదు. రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌లో పంత్‌కు రీప్లేస్‌మెంట్ ఆటగాళ్లు వీరే.
బాబా ఇంద్రజిత్
దేశీయ సీజన్‌లో బాబా ఇంద్రజిత్ అద్భుతంగా ఆడాడు. ఇది కాకుండా ఈ యువ ఆటగాడిని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. బాబా ఇంద్రజిత్ తమిళనాడుకు అద్భుతమైన క్రికెట్ ఆడాడు. IPL 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ స్థానంలో బాబా ఇంద్రజిత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు.
ప్రియాంక్ పంచాల్
IPL వేలం 2023లో ప్రియాంక్ పంచల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అంతకుముందు, దేశీయ సీజన్‌లో ప్రియాంక్ పంచల్ గుజరాత్ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రియాంక్ పంచల్ 12,270 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ గైర్హాజరీతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రియాంక్ పంచల్‌పై ఆధారపడే అవకాశం ఉంది.
దినేష్ బానా
2021లో భారత అండర్-19 జట్టు ప్రపంచాన్ని గెలుపొందింది. ఆ భారత జట్టులో దినేష్ బానా సభ్యుడు. ఈ యువ ఆటగాడు తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ లేకపోవడంతో దినేష్ బానా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గొప్ప ఆప్షన్ కావచ్చు.
అభిమన్యు ఈశ్వరన్
భారత్-ఎ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ వేలం 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమన్యు ఈశ్వరన్‌ను రూ.20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఆటగాడు 2013 సంవత్సరంలో దేశవాళీ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్‌లో 9,680 పరుగులు చేశాడు. అయితే IPL 2023లో అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ స్థానంలోకి రావచ్చు.
మహ్మద్ అజారుద్దీన్
మహ్మద్ అజారుద్దీన్ IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు. అయితే IPL వేలం 2023లో ఆర్సీబీ మొహమ్మద్ అజారుద్దీన్‌ను తీసుకోలేదు. నిజానికి మహ్మద్ అజారుద్దీన్ దేశవాళీ క్రికెట్‌లో కేరళ తరఫున ఆడుతున్నాడు. IPL వేలం 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ మహ్మద్ అజారుద్దీన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ రిషబ్ పంత్ స్థానంలో మహ్మద్ అజారుద్దీన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయత్నించవచ్చు.